Tuesday, May 17, 2022

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిర్బంధం

చిత్తూరు పర్యటనకు అనుమతి నో .. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నిర్బంధం

ఇదే సమయంలో టిడిపి నిర్వహించ తలపెట్టిన ఆందోళన కోసం అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు నిలువరించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదని చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించారు . ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, పోలీసులు చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో గంటకు పైగా ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు.

ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ఆందోళన

ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ఆందోళన

ఎంతకీ చంద్రబాబును బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవడంతో అక్కడే నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసనకు దిగారు. మరోవైపు టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది.

నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించి చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు . చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్టు తమకు తెలియదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

 చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ఆందోళన .. పలువురు అరెస్ట్

చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని టీడీపీ ఆందోళన .. పలువురు అరెస్ట్

అంతేకాదు చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్న టిడిపి కార్యకర్తలు చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు టిడిపి కార్యకర్తలను ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe