[ad_1]
Economic Survey Highlights:
దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.
ఆరేళ్లుగా వ్యవసాయ రంగం 4.6 శాతం వార్షిక వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీస మద్దతు ధర (MSP) పెంపు, వ్యవసాయ రుణాలు, ఆదాయ వృద్ధి పథకాలు, వ్యవసాయ బీమా వంటివి ఇందుకు దోహదం చేశాయని వివరించింది.
భారీగా మద్దతు ధరల పెంపు
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. 22 ఖరీఫ్, రబీ పంటలు, ఇతర వాణిజ్య పంటలకు 50 శాతం కనీస మద్దతు ధరలను పెంచిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సగటు వ్యవసాయ ఖర్చుల ఆధారంగా దీనిని అమలు చేశారు. పెరుగుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకొని స్వయం సమృద్ధి సాధించేందుకు పప్పులు, నూనె గింజల కనీస మద్దతు ధరలను పెంచింది.
ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగంపై ప్రధాన అంశాలు
- 2020-21లో వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి చేరాయి.
- 2020-21లో వ్యవసాయ ఎగుమతులు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. వీటి విలువ 50.2 బిలియన్ డాలర్లు.
- 2022-23 ఏప్రిల్-జులైలో పీఎం కిసాన్ కింద 11.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
- 2021-22లో వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత రుణాలు 18.6 లక్షల కోట్లకు పెరిగాయి.
- 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.7 మిలియన్ టన్నులుగా నమోదైంది.
- 2023 ఏడాదిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81.4 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతారు.
- పంట కోతల తర్వాత రైతులకు భరోసాగా వ్యవసాయ మౌలిక నిధుల కింద రూ.13,681 కోట్లు విడుదల చేశారు.
- జాతీయ వ్యవసాయ మార్కెట్లు (e-NAM) పరిధిలో 1.74 కోట్ల మంది రైతులు, 2.39 లక్షల మంది ట్రేడర్లు ఆన్‌లైన్, పారదర్శక బిడ్డింగ్ వ్యవస్థలో పాల్గొంటున్నారు.
- పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) కింద, రైతు ఉత్పత్తుల సంస్థల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
- అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది సందర్భంగా చిరుధాన్యాల ఉపయోగాన్ని భారత్ ప్రచారం చేస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.
Also Read: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక – ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్!
[ad_2]
Source link
Leave a Reply