Thursday, February 25, 2021

రైతులకు లిక్కర్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. రాకేశ్ టికాయిత్,బీజేపీ రియాక్షన్ ఇదీ…

National

oi-Srinivas Mittapalli

|

దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి హర్యానా కాంగ్రెస్ నేత విద్యా రాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రైతు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలంటే ప్రతీ ఒక్కరూ తమవంతుగా వారికి సహాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ‘డబ్బులు,కూరగాయలు,నెయ్యి… మద్యం అయినా పర్లేదు… మీకు తోచింది వారికి ఇవ్వండి..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు లిక్కర్ ఇవ్వమని ఆమె పిలుపునివ్వడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ నేత విద్యారాణి వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ‘మాకిక్కడ లిక్కర్‌తో ఏం పని… ఆమె ఎందుకిలా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివాళ్లు రైతు ఉద్యమానికి ఏమీ చేయనక్కర్లేదు. ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీరు చేసే ఉద్యమాల్లో ఏవైనా పంపిణీ చేసుకోండి..’ అని టికాయిత్ పేర్కొన్నారు.

విద్యా రాణి వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ‘రైతు ఉద్యమాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావించడం సిగ్గుచేటు. అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారు. రైతులను వారు కేవలం ఓటు బ్యాంకుగా,పొలిటికల్‌ టూల్‌గా వాడుకుంటున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leader shocking remark to support farmers protests rakesh tikait counters it

కేంద్రమంత్రులు హర్షవర్దన్,హర్‌దీప్ సింగ్ పురి కూడా విద్యారాణి వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతుల ఆందోళనల పట్ల కాంగ్రెస్‌ అసలు ఉద్దేశం ఏంటో విద్యారాణి వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు వ్యవహారమని విమర్శించారు.

కాగా,గత 80 రోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోని సింఘూ,టిక్రీ,ఘాజీపూర్‌ల వద్ద రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాక తాము అక్కడినుంచి కదిలేది లేదని వారు చెప్తున్నారు. కేంద్రం ఆ చట్టాలను ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా పక్కనపెట్టేందుకు ముందుకు రాగా… రైతులు అందుకు ఒప్పుకోలేదు. చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండా అని ముందునుంచి చెప్తున్నారు. అది జరిగేంతవరకూ ఢిల్లీ బోర్డర్లను ఖాళీ చేసేది లేదని… ఇంటికి వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు.


Source link

MORE Articles

బ్రేకింగ్: ముఖేశ్ అంబానీ ఇంటి బయట జిలేటిన్ స్టిక్స్.. రంగంలోకి క్రైం బ్రాంచ్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అంబానీ నివాసం ఆంటియాలా బయట ఓ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. వెంటనే...

Startup designs a modular, repairable laptop

As devices become less and less repairable, it’s always heartening when companies build devices with an eye on sustainability. After all, repairing the...

నాపై ఆసక్తి కనబర్చాడు… లెక్క చేయనందుకే ఇరికించాడు.. బీజేపీ మహిళా నేత సంచలన ఆరోపణలు

బాధితురాలిగా మిగిలాను : పమేలా గోస్వామి పమేలా గోస్వామి ఐదు రోజుల కస్టడీ పూర్తవడంతో పోలీసులు ఇవాళ ఆమెను ఎన్‌డీపీఎస్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ...

Sorare, an ethereum-powered marketplace for creating and trading football NFTs, raises $50M Series A led by Benchmark (Yogita Khatri/The Block)

Yogita Khatri / The Block: Sorare, an ethereum-powered marketplace for creating and trading football NFTs, raises $50M Series A led by Benchmark  — ...

మోడీ జీ ఉద్యోగాలివ్వండి ..యువత మన్ కీ బాత్ వినండి : ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ ఇదే !!

ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత మోడీకి వినతులు దేశం మొత్తం మీద ఉన్న ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా, వారిలో 30 ఏళ్ల లోపు...

వందల కోట్లు దోచుకున్న వెల్లంపల్లి అన్న కేశినేని నానీ .. నువ్వే గంజదొంగ అంటూ వెల్లంపల్లి ఫైర్

దుర్గగుడి అవినీతి కేసులో అసలు దోషి వెల్లంపల్లి : కేశినేని నాని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో జరిగిన అవినీతి కేసులో అసలు దోషి...

‘మీ మాజీ సీఎం వారి చెప్పులు మోయడంలోనే ఎక్స్‌పర్ట్’: నారాయణస్వామిపై మోడీ సంచలనం

పాండిచ్చేరి: ప్రధాని నరేంద్ర మోడీ పుదుచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ.. అనంతరం కాంగ్రెస్,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe