Tuesday, September 21, 2021

రైతులు ఇళ్ల దగ్గరే చావొచ్చుగా, ఉద్యమాలెందుకు? -బీజేపీ మంత్రి దలాల్ దివాళాకోరు కామెంట్లు -యూటర్న్

National

oi-Madhu Kota

|

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 81వ రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి రైతులు ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. రైతులను ఉద్దేశించి టెర్రరిస్టులు, ఖలీస్తానీ విభజనకారులంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు చనిపోయిన రైతులపైనా సంకుచిత వ్యాఖ్యలు చేశారు..

సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలు

గడిచిన మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్యమంలో కనీసం 200 మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడం, వారిని అమరులుగా గుర్తించాలని రైతు సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ రైతుల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”రైతులు ఆందోళన చేస్తున్నందుకే చస్తున్నారా ? ఏం? వాళ్లంతా ఇళ్లలోనే ఉండుంటే చావకపోయేవారా? ఆందోళనలో పాల్గొంటున్న రెండు లక్షల మంది ఇప్పటికీ ఇళ్లలోనే ఉండుంటే వారిలో కనీసం 200 మందైనా చచ్చేవాళ్లు కాదా?” అని మంత్రి దలాల్ అన్నారు. దీనిపై..

బీజేపీ మంత్రి దలాల్ వ్యాఖ్యలు దివాళకోరుతనాన్ని సూచిస్తున్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. దలాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ హర్యానా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. తాప్సీ పన్ను, రిచా చడ్డా లాంటి బాలీవుడ్ ప్రముఖులు సైతం మంత్రి కామెంట్లను ఖండించారు. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి దలాల్ యూటర్న్ తీసుకున్నారు…

వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం

తన మాటలను మీడియా వక్రీకరించిదని హర్యానా మంత్రి దలాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం మరోసారి స్పందించిన ఆయన.. తాను ఒకటి మాట్లాడితే, మీడిమా మరోలా ప్రసారం చేసిందని సెలవిచ్చారు. ఏదిఏమైనా తాను ఎప్పటికీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, తన మాటలతో ఎవరైనా బాధ పడితే క్షమించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత మంత్రి వ్యాఖ్యల వీడియో మళ్లీ వైరలైంది.


Source link

MORE Articles

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

The Best Gaming Monitors for 2021

Whether you're a serious PC gamer or a casual after-hours warrior, your hardware can be the pivot point between victory and...

Microsoft releases new perpetual Office for enterprise

Microsoft last week announced the availability of the next edition of perpetual-license Office for commercial and government customers.Dubbed "Office LTSC 2021," as in...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe