Sunday, March 7, 2021

రైతులు మన మాట వినేలా లేరు… వాళ్లను తప్పుదోవ పట్టించాల్సిందే.. బీజేపీ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు

National

oi-Srinivas Mittapalli

|

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల స్థితి గతులను మార్చేందుకు ఈ చట్టాలు ఉపకరిస్తాయని కేంద్రం చెబుతుండగా… ఈ చట్టాలతో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలే రైతులను ఇలా తప్పుదోవ పట్టించాయని కేంద్రం మొదటినుంచి విమర్శిస్తోంది. రైతుల ఆందోళనలతో ఓ మెట్టు దిగిన కేంద్రం… ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ రైతులు మాత్రం ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఢిల్లీ సరిహద్దులను వీడేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని ఎలా డీల్ చేయాలన్న విషయంపై బీజేపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది.

ఇలాంటి తరుణంలో తాజాగా హర్యానాలోని గుర్గావ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఓ బీజేపీ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘రైతులు మన మాట వినే పరిస్థితిలో లేరు… కాబట్టి వాళ్లను మనం తప్పుదోవ పట్టించాల్సిందే… ఇందుకోసం ఏమైనా సలహాలు,సూచనలు ఉంటే చెప్పండి.’ అని బీజేపీ కార్యకర్త ఒకరు సమావేశానికి హాజరైన పార్టీ పెద్దలను కోరాడు. ఈ సమావేశంలో హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓపీ ధన్‌కర్,క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్,ఎంపీ బ్రిజేంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

How To Mislead Farmers bjp worker asks tips from harayna bjp leaders

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసి బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. ‘రైతులను ఎలా మోసం చేయాలో చెప్పండని బీజేపీ కార్యకర్తలు మంత్రులు,నాయకులను అడుగుతున్నారు. ఇది బీజేపీ అసలు స్వరూపం.’ అని సూర్జేవాలా పేర్కొన్నారు.

కాగా,కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఘాజీపూర్,టిక్రీ,సింఘూ బోర్డర్‌లో రైతులు ఇప్పటికీ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ హింసాత్మక రూపం దాల్చడంతో… రైతుల ఆందోళనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రైతు ఉద్యమం నీరుగారుతుందని చాలామంది భావించారు. కానీ రైతులు మాత్రం పట్టు వదలకుండా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Source link

MORE Articles

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

ఓవైసీ గ్రాండ్ ఎంట్రీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కొనసాగుతుందని ఎంఐఎం పార్టీ ప్రకటించుకుంది....

ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల

పార్టీ పేరును ప్రకటించదలిచిన జిల్లాలోనే.. ఏ జిల్లాలోనైతే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తొలి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారో, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారో.. అదే...

घर में रखी इस चीज का सुबह से करें इस्तेमाल, होंगे जबरदस्त फायदे

नई दिल्लीः खुद को सेहतमंद रखने के लिए हम अक्सर कई चीजों का सेवन करते है. लेकिन आज हम आपको एक ऐसे घरेलू...

पुरुष इस समय रोज खाना शुरू कर दें मुट्ठी भर भीगे हुए चने, फिर जो होगा, यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं भीगे हुए चने के फायदे. भीगे हुए चने का सेवन पुरुषों के लिए ज्यादा...

International Women’s Day 2021: మనిషికి మనుగడ మహిళ

National oi-M N Charya | Published: Sunday, March 7, 2021, 6:01 ...

Apple Officially Discontinues the iMac Pro

(Image: PCMag)After four years on the market, Apple's iMac Pro is going away for good.Apple confirmed to CNET on...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe