ఢిల్లీ నుండి నుండి ఘజియాబాద్ వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ
అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వాహనాలు మరియు వాహనదారులకు మాత్రమే ఒక మార్గంలో అది కూడా ఢిల్లీ నుండి నుండి ఘజియాబాద్ వరకు ట్రాఫిక్ పునరుద్ధరించబడిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
“మేము అంతకుముందు అంబులెన్సులు వెళ్ళేలా చేసామని , ఇప్పుడు, పాక్షికంగా మార్గాన్ని తెరిచామని , అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న వాహనదారులను అనుమతిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పిన పోలీసులు ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఏర్పాటు అని స్పష్టం చేశారు .

రిపబ్లిక్ డే హింస తర్వాత ఘాజీపూర్ బోర్డర్ బ్లాక్ చేసిన పోలీసులు
ఏవైనా సమస్యలు తలెత్తితే, మళ్ళీ మార్గాన్ని మూసివేస్తామని కూడా చెప్పారు . గత 97 రోజులుగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న మూడు ప్రధాన సరిహద్దులలో ఘాజిపూర్ సరిహద్దు ఒకటి. ప్రారంభంలో, ఘజియాబాద్ నుండి ఢిల్లీ వైపు వెళ్లే మార్గాలు మాత్రమే మూసివేయబడ్డాయి. ఇక జనవరి 26 న రైతులు మరియు భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు జరిగాయి.
హింస తరువాత, పోలీసులు మొత్తం ఘాజిపూర్ సరిహద్దును బ్లాక్ చేశారు.

వాహన రాకపోకలను పునరుద్ధరిస్తున్న పోలీసులు
అనేక అంచెలుగా బారికేడ్లను ఉంచారు . రైతులు మళ్లీ నగరంలోకి ప్రవేశించకుండా చూసేందుకు రహదారిపై ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించబడింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఢిల్లీ మరియు ఘజియాబాద్ మధ్య ప్రయాణించే వాహనదారులకు అసౌకర్యం కలిగించింది. ఇక ఇప్పుడు ఆ మార్గాన్ని పాక్షికంగా పునరుద్ధరించటంతో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి.