Friday, July 30, 2021

రైతు ఉద్యమంపై మరోసారి ఐరాస కీలక వ్యాఖ్యలు… ఆందోళనకర పరిణామాలంటూ…

International

oi-Srinivas Mittapalli

|

పాలకులు చేసే చట్టాలు సంబంధిత వ్యక్తులతో అర్థవంతమైన చర్చల ఆధారంగా ముందుకెళ్లాల్సిన ప్రాధాన్యాన్ని భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలు నొక్కి చెప్తున్నాయని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల చీఫ్ మిచెల్లె బాచ్‌లెట్ అన్నారు. భారత రైతులు,అక్కడి ప్రభుత్వం మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో మానవహక్కుల సమస్యలపై జెనీవాలో జరుగుతున్న ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌ సదస్సులో శుక్రవారం(ఫిబ్రవరి 26) మిచెల్లె మాట్లాడారు.

ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులు,వారికి సంఘీభావం తెలుపుతున్న సామాజిక కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని మిచెల్లె తప్పు పట్టారు. అంతేకాదు,సోషల్ మీడియాలో భావ ప్రకటనా స్వేచ్చను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఇవన్నీ ఆందోళనకర పరిణామాలని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని కూడా ఐరాస మానవహక్కుల కౌన్సిల్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.

UN rights chief Michelle Bachelet key comments on farmers protests in india

గతంలోనూ ఐరాస తన అభిప్రాయాలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.’ఈ నిరసన రైతుల హక్కు. తాము విభేదించే అంశాలపై శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం వారికున్న ప్రజాస్వామ్య హక్కు. అధికారులు వారిని అడ్డుకోరాదు. ఏ దేశానికైనా మేం ఇదే చెబుతాం’ అని గతంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏంటానియో గ్యుటెరిస్‌ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్‌ పేర్కొన్నారు.

మిచెల్లె బాలెట్ భారత ప్రభుత్వంపై చేసిన తాజా వ్యాఖ్యలపై జెనీవాలో భారత దౌత్య ప్రతినిధి ఇంద్రమణి పాండే స్పందించారు. 2024కల్లా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ చట్టాలను తీసుకొచ్చారని చెప్పారు. చిన్న,సన్నకారు రైతులకు దీనివల్ల మేలు జరుగుతుందని… ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ పంటను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.

కాగా,వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మూడు చట్టాలను తాత్కాలికంగా ఏడాదిన్నర పాటు పక్కనపెడుతామని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రైతులు మాత్రం ఆ చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండాగా పోరాడుతున్నారు. రైతులు-కేంద్రం మధ్య నెలకొన్న ఈ ప్రతిష్ఠంభనకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించట్లేదు.


Source link

MORE Articles

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

Multani Mitti Face Pack : बारिश के मौसम में इस तरह चेहरे पर लगाएं मुल्तानी मिट्टी, ग्लो रहेगा बरकरार, खत्म होंगी ये skin problem

Multani Mitti Face Pack : पूरे देश में मानसून सक्रिय है और झमाझम का बारिश का दौर जारी है. बरसात (Monsoon) आते ही...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe