Monday, April 12, 2021

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్… ఆస్పత్రిలో చేరిక…

International

oi-Srinivas Mittapalli

|

దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో మంగళవారం(ఫిబ్రవరి 23) ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా.. టైగర్ వుడ్స్ కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం నుజ్జునుజ్జయింది. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోగా… హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

 tiger woods hospitalised after major car crash in california

అనంతరం ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కరే ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7.15గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

గత వీకెండ్‌లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గోల్ఫ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని బహుకరించారు. డిస్కవరీ గ్రూపుకు చెందిన గోల్ఫ్ టీవీలో ఓ కార్యక్రమానికి సంబంధించి సోమ,మంగళవారాల్లో ఆయన షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు.

టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు 2009,2017లలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మొదటి రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ఐదు నెలలు మిసిసిపీలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపారు. రెండో ప్రమాదంలోనూ కొద్ది నెలలకు కోలుకుని గోల్ఫ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.




Source link

MORE Articles

విషాదం : పండగ గ్రాండ్‌గా జరుపుకోవాలనుకున్న కుటుంబం… స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు…

కారులో బయలుదేరిన కుటుంబం... ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్ రెడ్డి(45) భార్య సుజాత(40),కుమార్తె నేహారెడ్డి(12),కుమారుడు సూర్యతేజలతో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో...

इन लोगों के लिए कमाल कर सकता है सौंठ वाला दूध, बस जान लें सेवन का सही तरीका, मिलेंगे गजब के फायदे

नई दिल्ली: अगर आप जल्दी थक जाते हैं तो यह खबर आपके काम आ सकती है. हम आपको एक ऐसी चीज के बारे...

नाश्ते में एक उबला हुआ अंडा खाने के फायदे जान लेंगे तो रोजाना खाएंगे

नई दिल्लीः कहा जाता है कि नाश्ता हमारे भोजन का सबसे अहम हिस्सा होता है. ऐसे में सभी हेल्थ न्यूट्रीशन बताते हैं कि...

Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after Alibaba's record $2.8B fine (Yuan Yang/Financial...

Yuan Yang / Financial Times: Employees at Tencent Music, Meituan, and other Chinese tech giants are expecting increased antitrust scrutiny and penalties after...

New Trailers: Cruella, The Woman in the Window, Loki, and more

So yesterday I watched the first episode of the Netflix documentary This is a Robbery, about the 1990 heist at the...

VW teases larger ID.6 electric SUV ahead of auto show debut | Engadget

VW has yet another round of electric vehicles in the pipeline, and it's not waiting until the official launch to offer a hint...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe