లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఇవే

[ad_1]

లంగ్ క్యాన్సర్ అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. అనేక లక్షణాలను చూపిస్తుంది. అవేంటి.. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

​లక్షణాలు..

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఒక్కో వ్యక్తికి లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. లంగ్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన కొంతమంది లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • దగ్గు
  • ఛాతి నొప్పి
  • శ్వాస ఆడకపోవుట
  • రక్తంతో కూడిన దగ్గు
  • విపరీతమైన అలసట
  • బరువు తగ్గడం

లంగ్ క్యాన్సర్ లక్షణాలలో దగ్గు ఒకటి. అయితే, ఇది అనేక సమస్యలు, ఇన్ఫెక్షన్లకి సంకేతం కావొచ్చు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో, శ్వాసకోశ వైరస్‌లు అభివృద్ధి చెందుతాయి. ప్రజలను ఇబ్బంది పెడతాయి.

Also Read : Home Decor : ఇంటిని ఇలా సింప్లీ సూపర్బ్‌గా డెకరేట్ చేయండి..

​ఏమేం సమస్యలు..

దగ్గు ఎనిమిది వారాలు, అంతకంటే ఎక్కువ కాలం ఉంటే అలసట, నిద్ర వంటి సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ, లంగ్ క్యాన్సర్‌తో పాటు, దీర్ఘకాలిక దగ్గు వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. మాయో క్లినిక్ ప్రకారం, దగ్గు, కొన్ని కారణాలు ఉన్నాయి.

  • పోస్ట్నాసల్ డ్రిప్
  • ఆస్తమా
  • గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్(GERD)

లంగ్ క్యాన్సర్‌ ఉంటే ఎన్నో లక్షణాలు ఇతర అనారోగ్యాలతో కూడా సంబంధం ఉంటుంది. అందుకే డాక్టర్‌ని కలిసి సలహా తీసుకోవడం మంచిదని సీడీసి చెబుతోంది. దీంతో సమస్య ఈజీగా కనుక్కోవచ్చు.

Also Read : Fatty Liver : వీటిని ఎక్కువగా తింటే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందట.. జాగ్రత్త..

​దగ్గు తగ్గకపోతే..

అయితే, యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం మూడు వారాల పాటు దగ్గు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. లంగ్స్ క్యాన్సర్‌ని సూచించే అవకాశం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. నొప్పితో కూడిన దగ్గు వస్తే వెంటనే పల్మొనాలజిస్ట్‌ని కలవడం ముఖ్యం.

మాయో క్లినిక్ ప్రకారం లంగ్ క్యాన్సర్ వాయు మార్గంలో రక్తస్రావం కలిగిస్తుంది. దీంతో రక్తంతో కూడిన దగ్గు వస్తుంది.

తరచుగా, లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1 సమయంలో , వ్యక్తులు సాధారణంగా ఎటువంటి లక్షణాలు ఉండవు. అయినప్పటికీ, అలా చేసినప్పుడు, రక్తంతో కూడిన దగ్గు ఓ లక్షణం అని చెప్పొచ్చు.

Also Read : Weight loss : ఈ ప్రోటీన్ ఫుడ్స్‌తో త్వరగా బరువు తగ్గుతారట..

​ఎలాంటి జాగ్రత్తలు..

లంగ్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు, సాధారణ లక్షణాలు ఉన్నా జాగ్రత్తగా ఉండాలి.

యూకె హెల్త్ బాడీ ప్రకారం.. లంగ్ క్యాన్సర్ పొగత్రాగడం వల్ల వస్తుంది. ఈ అలవాటు లేని వారికి కూడా సమస్య వస్తుంది. లంగ్ క్యాన్సర్‌కి సిగరెట్ పొగ అతి పెద్ద కారణం అయితే, సెకండ్ హ్యాండ్ రాడాన్ గ్యాస్, ఆస్బెస్టాస్,ఇతర క్యాన్సర్ కారకాలకు గురికావడం లేదా, వ్యాధి ఫ్యామిలీలో ఉండడం ఇతర అంశాలు కూడా ప్రమాదమే.

అడ్వాన్స్‌డ్ స్టేజ్ క్యాన్సర్‌ని తప్పించేందుకు, సరైన ట్రీట్‌మెంట్ కోసం రెగ్యులర్ చెకప్స్ ముఖ్యం

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *