[ad_1]
35 ఏళ్ల కష్టం..
అదుష్టం కోసం వెతికే వారిని చూస్తుంటాం. కానీ పట్టువదలకుండా ఏళ్ల తరబడి ప్రయత్నించే వారు చాలా అరుదు. ఈ కోవకు చెందిన వాడే పంజాబ్ కు చెంది 88 ఏళ్ల మహంత్ ద్వారకా దాస్. ఈ వృద్ధుడు జాక్‌పాట్ కోసం దశాబ్దాలుగా చేసిన ప్రయత్నం ప్రతయ్నం చివరికి కోటీశ్వరుడుగా మార్చేసింది. ఇటీవల అతడికి పంజాబ్ లాటరీలో ఏకంగా రూ.5 కోట్ల బహుమతి తగిలింది. పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023లో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. దీని వెనుక అతడి 35 ఏళ్ల అలుపెరగక టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు.
|
సంతోషంగా ఉందంటూ..
విజేతగా నిలిచిన మహంత్ ద్వారకా దాస్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. తాను గడచిన 35-40 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని వెల్లడించాడు. తాజాగా గెలిచిన మెుత్తాన్ని తన ఇద్దరు కుమారులకు ఇస్తానని చెబుతున్నాడు. ఈ సారి తన మనవడిని టిక్కెట్ కొనమని చెప్పినట్లు విజేతగా నిలిచిన దాస్ తెలిపాడు.
మనవడి చేయి చలవ..
లాటరీలో రూ.10,000 కంటే ఎక్కువ సొమ్మ బహుమతిగా వచ్చినందున టీడీఎస్ కట్ అవుతుంది. 30 శాతం పన్ను మినహాయింపు తర్వాత అతడికి మిగిలిన బహుమతి మెుత్తాన్ని అందిస్తామని అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ కరమ్ సింగ్ తెలిపారు. దీనికి తోడు ఇతర న్యాయపరమైన విషయాలను పూర్తి చేసి మిగిలిన మెుత్తాన్ని అందిస్తామని వారు చెబుతున్నారు. ఏదేమైతేనే చివరికి అతని కల నెరవేరినట్లు తెలుస్తోంది. అయితే తన మనవడి చేయి కలిసొచ్చిందని తాత తెగ సంబరపడిపోతున్నాడు.
[ad_2]
Source link