నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అంచనాలకు మించి అరశాతం మేర కీలక రేట్లను తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో కోత విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాలతో మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్లు పుంజుకొని 82,469 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగబాకి 25,091 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.60గా ఉంది.
The post లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. appeared first on Navatelangana.