Saturday, July 24, 2021

లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు…కానీ..

రెండు గంటల వ్యవధిలోనే జరిగిందా..?

వామన్‌రావు దంపతులు ఆరోజు మధ్యాహ్నం 11.30గంటల సమయంలో మంథని కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా కల్వచర్ల వద్ద హత్యకు గురయ్యారు. కోర్టుకు రావడం,హత్యకు గురవడం… ఈ రెండింటి మధ్య కేవలం రెండున్నర గంటల వ్యవధి మాత్రమే ఉన్నది. ఈ వ్యవధిలోనే కుంట శ్రీను వామన్‌రావు దంపతుల హత్యకు స్కెచ్ వేసి అమలుచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హత్యకు మూడు రోజుల ముందు నుంచే స్కెచ్ గీశారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.

రెక్కీ... హత్య...

రెక్కీ… హత్య…

కేసులో ఏ-3గా ఉన్న అక్కపాక కుమార్‌తో కుంట శ్రీను కోర్టు వద్ద రెక్కీ నిర్వహించాడు. కుమార్ ఎప్పటికప్పుడు వామన్‌రావు కదలికలపై సమాచారం అందించాడు. ఇదే క్రమంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలిసి హత్య గురించి కుంట శ్రీను చర్చించాడు. ఇద్దరు కలిసి స్పాట్ ఫిక్స్ చేశారు. అనంతరం అనుకున్నట్లుగానే రామగిరి మండలం కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతుల కారును తమ కారుతో అడ్డగించి దాడికి పాల్పడ్డారు. కుంట శ్రీను,శివందుల చిరంజీవి ఇద్దరూ కలిసి వారిని దారుణంగా హతమార్చారు.

ఒక్కడినే చంపాలనుకున్నారు... కానీ..

ఒక్కడినే చంపాలనుకున్నారు… కానీ..

ఈ హత్యకు బిట్టు శ్రీను కారు,కత్తులు సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంథనిలోని ఓ షాపులో వాటిని కొనుగోలు చేసి కారులో పెట్టినట్లు తెలుస్తోంది. అదే కారును బిట్టు శ్రీను కుంట శ్రీనుకు ఇవ్వడంతో.. చిరంజీవితో కలిసి అతను కల్వచర్ల సమీపంలోని స్పాట్ వద్దకు వెళ్లాడు. అక్కడే వామన్‌రావు కోసం ఎదురుచూసి… అతని కారు కనిపించగానే వెంబడించి అడ్డగించాడు. ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. నిజానికి వామన్‌రావు ఒక్కడినే చంపాలనేది కుంట శ్రీను ప్లాన్ అయినప్పటికీ… స్పాట్‌లో నాగమణి కూడా ఉండటంతో సాక్ష్యాధారాలు లేకుండా ఆమెను కూడా హత్య చేసినట్లు తెలుస్తోంది.

సీన్ రీకన్‌స్ట్రక్షన్...

సీన్ రీకన్‌స్ట్రక్షన్…

ఏ-1 కుంట శ్రీను,ఏ-2 శివందుల చిరంజీవి,ఏ-3 అక్కపాక కుమార్‌లతో పోలీసులు శుక్రవారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ముందు నిందితులను హాజరుపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు బిట్టు శ్రీను అరెస్టు తర్వాత అతని బాధితులు తెరపైకి వస్తున్నారు. ఇనుముల సతీష్ అనే మాజీ వార్డు సభ్యుడు మాట్లాడుతూ… గతంలో కుంట శ్రీను,బిట్టు శ్రీను తనపై బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. 2018లో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తులపై తాను కేసు వేయడంతో… దాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఆ కేసును వామన్‌రావు దంపతులే వాదించినట్లు చెప్పారు.

బిట్టు శ్రీనుపై మాజీ వార్డు సభ్యుడు సతీష్ ఆరోపణలు

బిట్టు శ్రీనుపై మాజీ వార్డు సభ్యుడు సతీష్ ఆరోపణలు

తాను కేసును వెనక్కి తీసుకోకపోవడంతో తనను అంతమొందించేందుకు కుంట శ్రీను సుపారీ మాట్లాడాడని సతీష్ ఆరోపించారు. కుంట శ్రీను,బిట్టు శ్రీను కలిసి తన హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో అప్పట్లోనే బయటకు రాగా అప్పటి డీజీపీ,రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఆ ఆడియో టేపును అందించినట్లు చెప్పారు. ఇప్పటివరకూ పోలీసులు దానిపై ఏమీ తేల్చలేదని వాపోయారు. తనతో పాటు మొత్తం నలుగురిని టార్గెట్ చేశారని… ఒకరిపై పీడీ యాక్ట్ పెట్టారని,మరొకరిని లొంగదీసుకున్నారని చెప్పారు. చివరకు వామన్‌రావును హత్య చేశారని,ఇక తానే మిగిలానని,తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


Source link

MORE Articles

How to watch Surfing at Olympics 2020: key dates, schedule, free live stream and more

 Set to make a splash in Tokyo, surfing is one of five brand-new sports to make its Olympic debut at the 2020 Games....

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe