Wednesday, May 18, 2022

లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..

Telangana

oi-Rajashekhar Garrepally

|

హైదరాబాద్/మంథని: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో నిందితులు ఉపయోగించిన కత్తులను పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53వ నెంబర్ పిల్లర్ వద్ద కత్తులు లభ్యమయ్యాయి. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే నిందితులను ఆదివారం పార్వతి బ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం కూడా గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నెంబర్ పిల్లర్ వైపు గాలించగా అక్కడే కత్తులు లభ్యమయ్యాయి.

కాగా, వామన్ రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాద దంపతుల హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన పోలీస్ శాఖ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద విచారించారని హైకోర్టు ప్రశ్నించింది. ఎంతమందిని మంథని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని హైకోర్టు ప్రశ్నించింది.

బాధితుల క్రిటికల్ స్టేట్‌మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి వాంగ్మూలాన్నినమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని నిలదీసింది. అయితే, బాధితులు తీవ్రగాయాలతో బాధపడుతుండటంతో వారిని ప్రశ్నించలేకపోయామని పోలీసుల తరపున ఏజీ కోర్టుకు తెలిపారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe