Sunday, May 15, 2022

లైవ్ డిబేట్‌లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ

విష్ణువర్ధన్‌పై చెప్పుతో దాడి..

రాజధాని అమరావతిపై చానెల్ నిర్వహించిన చర్చలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ప్యానలిస్టులుగా పాల్గొన్నారు. అమరావతిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు గానూ జగన్ సర్కారు అప్పు చేయబోతున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉందని విష్ణువర్ధన్ మాట్లాడుతుండగా, ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యానాలు వద్దంటూ జేఏసీ నేత శ్రీనివాసరావు అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఇద్దరికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో.. ‘‘టీడీపీ ఆఫీసులో పని చేసుకో.. టీడీపీ జెండా పట్టుకో..”అని శ్రీనివాసరావును విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. జేఏసీ నేత శ్రీనివాసరావు.. కాలికున్న చెప్పును తీసి విష్ణువర్ధన్ పై దాడి చేశారు. అంతేకాదు..

జేఏసీ నేత బహిష్కరణ..

జేఏసీ నేత బహిష్కరణ..

అమరావతిపై నిర్వహించిన లైవ్ టీవీ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువ్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడిచేసి, దుర్భాషలాడిన కారణంగా జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావును బహిష్కరిస్తున్నట్లు చర్చా వేదిక హోస్ట్ ప్రకటించారు. శ్రీనివాసరావు దళితుడే కావొచ్చు.. బాగా చదువుకొని ఉండొచ్చు.. కానీ హుందాగా జరుగుతోన్న చర్చలో విచక్షణ కోల్పోయి, దాడిలో చేయడాన్ని సహించబోమని, వీలైతే వెటకారంతో కూడిన విమర్శలు లేదంటే సమర్థవంతమైన వాదన వినిపించాలేగానీ చర్చల్లో దాడులకు తావు లేదని, జేఏసీ నేత డాక్టర్ శ్రీనివాసరావును చర్చ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని చానెల్ హోస్టు ప్రకటించారు. ఆ వెంటనే..

 ఇలాంటోళ్లను టీవీల్లోకి రానీయొద్దు..

ఇలాంటోళ్లను టీవీల్లోకి రానీయొద్దు..

తాను 15 ఏళ్లుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్నానని, ఏనాడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని, చెప్పుతో దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరో కూడా తెలీదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వాపోయారు. ఇలాంటి చర్యల వల్ల బీజేపీ విలువ ఏమాత్రం తగ్గబోదని, శ్రీనివాసరావు వెనకున్న ప్రేరక శక్తులు ఎవరో తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా స్పందించారు. విష్ణుపై చెప్పుతో దాడిని ఖండిస్తున్నామని, స్వీయనింత్రణ లేని వ్యక్తులను టీవీ చర్చలకు పిలవొద్దని, దాడి చేసిన శ్రీనివాసరావుపై చానెల వారే పోలీసు కేసు పెట్టాలని సోము అన్నారు. అయితే..

దళిత నేత అయినందుకే..

దళిత నేత అయినందుకే..

టీవీ చానెల్ లైవ్ డిబేట్ లో బీజేపీ నేతల విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన జేఏసీ నేత శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ వ్యవహారంలో కులం కోణంపైనా చర్చ జరుగుతోంది. దళిత నాయకుడు కావడం వల్లే శ్రీనివాసరావుపై బహిష్కరణ దాకా వెళ్లారని, అదే శ్రీనివాసరావును టీడీపీ కూలీగా అభివర్ణించిన విష్ణువర్ధన్ రెడ్డిని మాత్రం చానెల్ వారు వెనకేసుకురావడంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ‘అమరావతి పౌరుషం..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా ఈ దాడిని సమర్థిస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో చర్చను కూడా తాము ఖండిస్తున్నట్లు హోస్టు ప్రకటించడం గమనార్హం. ఈలోపే..

పేరు చివర కులం తోకలు..

పేరు చివర కులం తోకలు..

కాగా, టీవీ డిబేట్ వ్యవహారంపై టీడీపీ మహిళా నేత, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘పేరు చివర రెండక్షరాల తోక చూసుకుని కుల మదంతో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. దళితుల మీద దాడి చేస్తే చెప్పు తెగుద్ది అనడానికి ఇదే నిదర్శనం. సీఎం గారి నెల జీతంతో బతికే పెయిడ్ ఆర్టిస్తు మీరు, దళిత ఉద్యమ నేతను నోటికి వచ్చినట్లు మాట్లాడతారా..” అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీరును అనిత తప్పుపట్టారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe