Sunday, July 25, 2021

వచ్చే 12 రోజులు చాలా కీలకం… కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే… : బీఎంసీ చీఫ్

National

oi-Srinivas Mittapalli

|

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై,నాగ్‌పూర్,నాసిక్‌ వంటి ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమరావతి,అచల్‌పూర్ పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. తాజాగా బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ చహర్ ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 12 రోజులు ముంబై నగరానికి చాలా కీలకమని ఇక్బాల్ పేర్కొన్నారు. కాబట్టి కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారి పట్ల బీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని… వధూవరుల తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉండదని హెచ్చరించారు.

వివాహ వేడుకలకు దయచేసి 50 కన్నా ఎక్కువమంది హాజరుకావొద్దని రెండు చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు తప్పవన్నారు.

కొత్తగా నమోదవుతున్న కేసుల్లో వైరస్ కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముంబైలో లోకల్ రైళ్లు నడుస్తుండటం ఇందుకు ప్రధానంగా కారణంగా చెప్పారు.

ప్రజలు కోవిడ్ 19 నిబంధనలు పాటించకుంటే మహారాష్ట్ర మరోసారి లాక్‌డౌన్‌ను ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే హెచ్చరించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌనే కావాలంటే ఎవరికి నచ్చినట్లు వారు తిరగండి అంటూ ఆయన మండిపడ్డారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే మాత్రం మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే అమరావతి,అకోలా,బుల్దానా,వషీమ్,యావత్‌మల్ జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు.

మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నిఘా పెట్టిందని తెలిపారు.


Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe