PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వచ్చే 4 రోజుల్లో 3 రోజులు ఒక్క బ్యాంక్‌ కూడా పని చేయదు, పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి

[ad_1]

Bank Holidays list in August 2023: ఈ నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు వచ్చాయి. ఈ వారంలో శనివారం నుంచి వచ్చే మంగళవారం వరకు, ఈ 4 రోజుల్లో 3 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. చెక్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, డీడీ తీయడం, క్యాష్‌ డిపాజిట్‌, క్యాష్‌ విత్‌డ్రా, కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేయడం, అకౌంట్‌ క్లోజ్‌ చేయడం, లోన్‌ తీసుకోవడం, 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవడం సహా ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఎలాంటి పనున్నా… బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వచ్చాయో ముందుగా తెలుసుకోండి. హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి. దీనివల్ల, సెలవు రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు, టైమ్‌ సేవ్‌ అవుతుంది.

ఈ వారంలో రెండో శనివారం (ఆగస్టు 12వ తేదీ) వచ్చింది. కాబట్టి, బ్యాంక్‌లకు ఆ రోజు సెలవు. ఆ తర్వాత ఆదివారం (ఆగస్టు 13వ తేదీ) కూడా సెలవు. సోమవారం (ఆగస్టు 14) రోజు బ్యాంకులు పని చేస్తాయి. ఆ తర్వాత, మంగళవారం రోజున స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15). ఆ రోజున కూడా బ్యాంకులకు సెలవే. మొత్తంగా చూస్తే, ఈ నాలుగు రోజుల్లో మూడు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడేస్‌. వరుసగా నాలుగు రోజులు హాలిడేస్‌ ఎంజాయ్ చేయడానికి, ఆ ఒక్క వర్కింగ్‌ డే (సోమవారం, ఆగస్టు 14) రోజున కూడా చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి, సిబ్బంది కొరతతో ఆ రోజున కూడా బ్యాంక్‌లో పని లేటయ్యే ఛాన్స్‌ ఉంటుంది.

ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 12 రోజులు సెలవులు
ఆగస్టు 12, రెండో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి.

2023 ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

ఆగస్టు 12 – రెండో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15 – మంగళవారం – (స్వాతంత్ర్య దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 16 – బుధవారం – (పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి): బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18 – శుక్రవారం – (శ్రీమంత శంకరదేవుని తిథి) గువాహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26 – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27 – ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28 – సోమవారం – (మొదటి ఓనం) కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 – మంగళవారం – (తిరువోణం) కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 – బుధవారం – (రాఖీ పండుగ) జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 – గురువారం – (రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్): డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ‘హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’, ‘రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్’ & ‘క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌’. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: కష్టకాలంలో నష్టాలను తగ్గించే మంత్రమిది – ఇన్వెస్టర్లు చాలా డబ్బు సంపాదించారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *