గుండెకి..

గుండె సమస్యలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి. గుండె సమస్యల్ని తగ్గించడానికి మన లైఫ్‌స్టైల్ కీ రోల్ పోషిస్తుంది. హైబీపి, హై కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి కారణాలు ప్రమాదకరమైన గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఉప్పగా ఉండే ఆహారాలు రక్తపోటుపై ఎఫెక్టివ్ ప్రభావాలను చూపుతాయని అనేక అధ్యయనాలు చూపించినప్పటికీ, మరిన్ని అధ్యయనాలు అవసరం. అలాగే స్పైసీ ఫుడ్స్ కొలెస్ట్రాల్‌కి మంచివని చెబుతారు.

జీవక్రియ..

జీవక్రియ..

మీరు తీసుకునే ఆహారాలు జీవక్రియని ఎఫెక్ట్ చేస్తాయి. మీరు తీసుకునే ఫుడ్స్, డ్రింక్స్ శక్తిగా మారుతుంది. మీ మెటబాలిజం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ శక్తి ఉంటుంది. మసాలా ఫుడ్స్ జీవక్రియని పెంచుతాయి. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా, ఇది రోజంతా కేలరీలను తినడాన్ని తగ్గిస్తుంది.
Also Read : White clothes : ఇలా ఉతికితే తెల్ల బట్టలు ముత్యాల్లా మెరుస్తాయి..

పేగు ఆరోగ్యం..

పేగు ఆరోగ్యం..

అయితే, ఉప్పు, స్పైసీ ఫుడ్స్ గట్ హెల్త్‌కి మంచివని చెబుతారు. నిజానికీ, కాలేయంలో చాలా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని, జీర్ణక్రియని బ్యాలెన్స్‌ చేయొచ్చు. స్పైసీ ఫుడ్స్ గట్‌లోని చెడు బ్యాక్టీరియా తగ్గించి మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి.

నొప్పి నివారిణి..

నొప్పి నివారిణి..

అవును, స్పైసీ ఫుడ్స్ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. అధ్యయనాల ప్రకారం, స్పైసీ ఫుడ్స్ ఆస్టియో ఆర్థరైటిస్, డయాబెటిస్ ఉన్నవారిలో నొప్పిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి.
Also Read : లో దుస్తులు ఉతకకుండా వాడుతున్నారా.. ఇది మీ కోసమే..

నష్టాలు..

నష్టాలు..

స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం ఇష్టమే అయినప్పటికీ, దీని వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని గుర్తుంచుకోండి. ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి ఉన్న వారు స్పైసీ ఫుడ్స్ తింటే సమస్యలొస్తాయి. దీని వల్ల

గుండెల్లో మంట
అతిసారం
వికారం
కడుపునొప్పి సహా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

​​​​​​​​గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​Read More : Health News and Telugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *