[ad_1]
మల్టీబ్యాగర్ ఆఫ్ ఇయర్..
చాలా కంపెనీలు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంపెనీ మాత్రం 2022 సంవత్సరానికి బెస్ట్ మల్టీబ్యాగర్ కంపెనీగా నిలిచింది. ఈ క్రమంలో రాకెట్ వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగించిన స్టాక్ 2277 శాతం లాభపడింది. కంపెనీ షేర్లు భారీగా పెరగటంతో చాలా మంది ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కోల్ ట్రేడింగ్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న Hemang Resources Ltd స్టాక్ గురించే. అవును 2022 ప్రారంభంలో ఈ స్టాక్ ధర కేవలం రూ.3 మాత్రమే. కానీ రాకెట్ వేగంతో వృద్ధి చెందిన కంపెనీ షేర్ ప్రస్తుతం రూ.70 స్థాయిల వద్ద ఉంది. ఉదయం 10.25 గంటల సమయంలో స్టాక్ దాదాపుగా 5 శాతం నష్టపోయి రూ.66.35 వద్ద బీఎస్ఈలో ఉంది.
కంపెనీ ఆదాయం..
2022 సెప్టెంబరుతో ముగిసినం రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.155.3 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలానికి కంపెనీ నికర లాభం రూ.19.52 కోట్లుగా ఉంది. గత సంవత్సరం కంపెనీ ఇదే కాలంలో సున్నా రాబడిని కలిగి ఉంది. గత ఏడాది కంపెనీ ఇదే కాలంలో రూ.5 లక్షల నష్టాన్ని నమోదు చేసింది.
కంపెనీ వ్యాపారం..
హేమాంగ్ రిసోర్సెస్ లిమిటెడ్ బొగ్గు విక్రయ వ్యాపారంలో ఉంది. ఈ క్రమంలో కంపెనీ దేశంలో ఉత్పత్తి అయిన బొగ్గుతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా విక్రయిస్తోంది. అలాగే భూ వ్యాపారంలో ఉన్న కంపెనీ.. స్టీవ్‌డోరింగ్, లాజిస్టిక్స్ సేవలను సేవలను సైతం అందిస్తోంది. ఇటీవలి కాలంలో డిమాండ్ భారీగా పెరగటం వల్ల ఇంధన ఏర్పడింది. సంక్షోభ సమయంలో దిగుమతి చేసుకున్న బొగ్గు ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. ఇది కంపెనీకి భారీగా కలిసొచ్చింది. కంపెనీకి వచ్చిన ఆర్డర్లు మార్కెట్ల ఒడిదొడుకుల్లోనూ కలిసొచ్చింది.
[ad_2]
Source link