4 day work week
రాబోయే రోజుల్లో పని దినాలు నాలుగు రోజులకే కుదించుకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక సంకేతాలిచ్చింది. కొత్తగా తీసుకువస్తోన్న కార్మిక చట్టాల్లో ఈ 4 day work week(వారంలో 4 రోజులే పనిదినాలు) అంశాన్ని పొందుపర్చినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం అధికారికంగా ప్రకటించారు. మన దేశంలో సరికొత్తదయిన ఈ నియమం ప్రకారం..
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

పని గంటల్లో తేడా ఉండదండీ..
పేరుకు పనిదినాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయా సంస్థల ప్రొడక్టివిటీ దృష్ట్యా పని గంటల్లో కోతలు మాత్రం ఉండబోవన్నది సుస్పష్టం. వారంలో నాలుగు రోజుల పని దినాలను మొత్తంగా 48 గంటల పరిమితికి మించకుండా అమలు చేసుకునే వీలును కేంద్రం కల్పించనుంది. ఇది మూడు రకాలుగా ఉండబోతోంది. వారంలో నాలుగు రోజుల పని దినాలైతే 12 గంటల పరిమితితో అమలు చేయవచ్చు, ఐదు రోజుల పని దినాలు అయితే 10 గంటల పరిమితితో అమలు చేసుకోవచ్చు, ఇక ఆరు రోజుల పని దినాలు అయితే 8 గంటల పరిమితి అమలు చేయవచ్చు. ప్రస్తతం..

కంపెనీలు, ఉద్యోగుల ఇష్టం..
దేశంలోని చాలా కంపెనీల్లోఆరు రోజుల పని దినాలు అమలవుతుండగా, ఐదు రోజుల పని దినాల సంస్థల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాగా, కొత్త చట్టాలు అమలులోకి వస్తే నాలుగు రోజుల పని దినాలకు మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు అనేది తప్పనిసరి కాదని, అన్ని కంపెనీలు విధిగా 4 day work weekను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేయబోదని, ఆయా యాజమాన్యాలు, అందులో పనిచేస్తోన్న కార్మికులు లేదా ఉద్యోగుల ఇష్టాల మేరకే అమలు చేసుకోవచ్చని అపూర్వ చంద్ర పేర్కొన్నారు. ఇక..

త్వరలోనే బిల్లు రూపకల్పన..
దేశంలో వారానికి నాలుగు రోజుల పనిదినాల అంశం ప్రస్తుతానికి ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. ‘‘ఇండియాలో పని విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం. అయితే బిల్లు రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాం” అని చెప్పారు. అంతేకాదు..

అందరికీ ప్రధాని సురక్షా బీమా..
కొత్త కార్మిక చట్టాలు, నాలుగు రోజుల పనిదినాల నియమాల రూపకల్పనలో ఎక్కువ మంది సూచనలు తీసుకుంటున్నామని, వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలతో ప్రస్తుత నియమాలను రూపొందిస్తున్నామని అపూర్వ చంద్ర చెప్పారు. దీనిపై ఈ జూన్‌లో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామన్న ఆయన.. అసంఘటిత కార్మికులు, రోజువారి కూలీలు, వలస కూలీలతో పాటు ఇతర వర్కర్ల రిజిస్ట్రేషన్‌కు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద తగిన సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.