వార్ 2లో ఎన్టీఆర్ స్క్రీన్ టైం.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!

Date:

Share post:


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను స్పై యూనివర్స్ లో కీలక ఘట్టంగా.. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ వార్‌ సినిమాలో.. కబీర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే హిందీలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న వార్‌కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఇక వార్ సినిమాలో తన పాత్రని హృతిక్ రోషన్ పార్ట్ 2 లోను కంటిన్యూ చేస్తుండగా.. ఈ సినిమాల్లో కొత్తగా తారక్ క్యారెక్టర్ యాడ్ అయింది. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది.. పాత్ర నడివి.. రెమ్యూనరేషన్ లాంటి అంశాలు ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

War 2' Shoot Begins: Hrithik Roshan & Jr NTR's Photo Leaked Online

ఇలాంటి క్రమంలో సినిమాలో తారక్ స్క్రీన్ టైమ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. సినిమాలో దాదాపు 75 నుంచి 80 నిమిషాల పాత్ర న‌డివితో ఎన్టీఆర్ మేరవనున్నాడని.. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో 74 నిమిషాల స్క్రీన్ టైం కంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ టైం మరింతగా ఉండనుందని.. ఎన్టీఆర్‌ను ఈ రోల్‌లో ఎంతో కీలకంగా, పవర్ ఫుల్ గా చూపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా మూడు గంటల పైనే ఉంటుందని తారక్, హృతిక్ ఇద్దరు సమానంగా స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ 150 నుంచి 160 నిమిషాల న‌డివితో తెర‌కెక్క‌గా.. ప్రస్తుతం వస్తున్న యానిమల్, పుష్ప ది రూల్‌ లాంటి సినిమాలు మూడు గంటల పైన నడివితోను బ్లాక్ బస్టర్ అందుకున్న క్రమంలో.. వార్ 2 విషయంలో య‌ష్ రాజ్ ఫిలిమ్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

Jr. NTR's Intense Look Leaked from War 2 - TeluguBulletin.com

ఇటీవల.. హృతిక్ జపాన్ కత్తితో యాక్షన్ సీన్స్ చేస్తూ ఉన్న వీడియో నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది .అంతేకాదు.. సినిమాలో ఎన్టీఆర్ ఉండడం మరింత హైలెట్. ఈ క్రమంలోనే వాటితో సినిమాకు భారీ లెవెల్లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. కాగా.. సినిమాల్లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరి పాత్ర నడివి సమానంగా ఉన్న క్రమంలోనే ఇద్దరి రెమ్యునరేషన్ కూడా సమానంగా ఉందని.. ఇద్దరు సినిమా కోసం రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇందులో వాస్తవం ఏంటో తెలియదు గాని ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారక్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఎన్నో క్రేజీ ప్రాజెక్టులో నటించాలని.. మరిన్ని బ్లాక్ బస్టర్లు అందుకుని మార్కెట్లో అంతకంతకు క్రేజ్‌ పెంచుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...