వాల్‌నట్స్ తింటే బ్రెయ్‌న్ హెల్త్‌తో పాటు గుండె ఆరోగ్యం కూడా బావుంటుందా..

[ad_1]

నట్స్‌లో ఒకటైన వాల్‌నట్స్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా సమస్యలకి వాల్‌నట్స్ తినడం వల్ల మంచిదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా తినాలని చెబుతున్నారు.

​గుండెకి మంచిది..

వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకి చాలా మంచిది. ధమనుల్లో ఫలకం ఏర్పడేలా చేస్తాయి. గుండెని కాపాడడంలో ఇవి బాగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఈ వాల్ నట్స్ కొవ్వుని తగ్గించి బీపిని తగ్గిస్తాయి. బీపి తగ్గడం వల్ల చాలా వరకూ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వీటిని తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Also Read : Romantic Life : ఉప్పు ఎక్కువగా తింటే శృంగారం చేయలేరా..

​బరువు తగ్గడం..

కేలరీలతో నిండి ఈ నట్స్ బరువు తగ్గడం మెంటెయిన్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. ఈ నట్స్ తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని హెల్దీ స్నాక్స్‌లా తినొచ్చు. ఆకలిని తగ్గిస్తాయి. రోజువారీ కేలరీల కోసం వాల్‌నట్స్‌ని హ్యాపీగా తినొచ్చు. బరువుని తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read : Kidney stones : ఇలా చేస్తే కిడ్నీల్లోని రాళ్లు తగ్గుతాయి..

​బ్రెయిన్ హెల్త్..

వాల్‌నట్స్ తినడం వల్ల మెదడుకి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. వాల్‌నట్స్ చూడ్డానికి బ్రెయిన్‌లానే ఉండడం కూడా దీనికి సూచన అని చెబుతారు. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పాలిఫెనోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వృద్ధాప్యానికి ముఖ్యమైన కారకాల్లో ఒకటి. వాల్‌నట్స్ తినడం వల్ల బ్రెయిన్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. వీటిని తినడం వల్ల డిప్రెషన్ కూడా దూరమవుతుంది. వీటిని తింటే సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. వాల్‌నట్స్‌లో ట్రిప్టోఫాన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.

​క్యాన్సర్‌కి వ్యతిరేకంగా..

వాల్‌నట్స్‌లో వై టోకోఫెరోల్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసే విటమిన్ ఇ కలిగి ఉంటాయి. అదే విధంగా రిచ్‌ప్లాంట్ పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒమేగా 3 యాక్సిడేటివ్ స్ట్రెస్, మంట సమస్యల్ని దూరం చేస్తాయి. ఇవి రెండు కూడా క్యాన్సర్‌ని పెంచే ప్రమాద కారకాలు.

Also Read : Sore Throat : ఈ టీ తాగితే గొంతునొప్పి ఇట్టే తగ్గుతుందట..

​గట్ హెల్త్..

గట్ హెల్త్ బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాల్‌నట్స్‌లో ఎక్కువగా ప్రో బయోటిక్, బ్యూట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల పెరుగుదలపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల గట్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. మెరుగైన బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, షుగర్ నియంత్రణకు గట్ హెల్త్ ముఖ్యం. కాబట్టి రెగ్యులర్‌గా వాల్‌నట్స్ తినడం చాలా మంచిది. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

​చివరిగా..

హెల్దీ లైఫ్‌స్టైల్‌తో పాటు ఈ నట్స్ తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి రోజుకు మీరు ఎంత తినాలి. ఎలా తినాలి.. దీని వల్ల మీకు ఏమేం లాభాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ని కలిసి సలహా తీసుకోండి. ఎందుకంటే ఒక్కో శరీర తత్వాన్ని బట్టి ఏ పరిమాణంలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *