భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వారి అవసరాలకు అనుగుణంగా సరికొత్త సామర్థ్యాలతో ఈట్రస్ట్ 350 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి ఈ మోడల్‌ను విడుదల చేయాలని ప్యూర్ ఈవీ ప్లాన్ చేస్తోంది.

ప్యూర్ ఈవీ అభివృద్ధి చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా భారతీయ ఉత్పత్తి కావడం విశేషం. ఈ మోడల్ ఉత్పత్తి, డిజైన్ మరియు నిర్మాణం అన్నీ స్థానికంగానే జరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ప్రోత్సహించేందుకు గాను భారత ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ 2లోని ఆర్థిక ప్రయోనాజలు కూడా ప్యూర్ ఈవీకి లభించే అవకాశం ఉంది.

ప్యూర్ ఈవీ ఆవిష్కరించిన ఈ సరికొత్త ఈట్రస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చామని, ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్ నాటికి దేశవ్యాప్తంగా 50 డెమో ఈట్రస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఉన్న ప్యూర్ ఈవీ డీలర్షిప్ కేంద్రాలలో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కస్టమర్ల కొనుగోళ్ల కోసం ఈ మోడల్‌ను ఆగస్ట్ 2021 నాటికి విడుదల చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది.

తాజా నివేదికల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ముందుగా బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణే నగరాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్యూర్ ఈట్రస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లోనే తయారు చేయనున్నారు. మార్కెట్లో దీని ధర సుమారు రూ.1 లక్ష రేంజ్లో ఉండొచ్చని అంచనా.

ప్యూర్ ఈట్రస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్‌ను కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను అధికారికంగా విడుదల చేసే సమయంలో కంపెనీ దీని బ్యాటరీపై ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

ప్యూర్ ఈవీ ప్రస్తుతం భారతదేశం అంతటా 100 టచ్ పాయింట్లను కలిగి ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ తన నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అంతేకాకుండా, నేపాల్ వంటి పొరుగు మార్కెట్లతో పాటుగా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది.

గమనిక: 2 మరియు 3 ఫోటోలు మినహా మిగతావన్నీ ఉదాహరణకు కోసం ఉపయోగించబడివి.