Saturday, April 17, 2021

విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర… సాయంత్రం భారీ బహిరంగ సభ…

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం(ఫిబ్రవరి 20) విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకూ 22కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విజయసాయి తన పాదయాత్రను ప్రారంభించారు.మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు కూడా పాదయాత్రలో విజయసాయి వెంట నడుస్తున్నారు.

సాయంత్రం సమయంలో కూర్మన్నపాలెం జంక్షన్‌‌లోని స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ఆర్చ్‌ వద్ద పాదయాత్ర ముగియనుంది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో విజయసాయి,వైసీపీ నేతలు ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకే ఈ పాదయాత్ర చేస్తున్న‌ట్లు ఆయన వెల్లడించారు.

mp vijayasai reddy padayatra begins in vizag against steel plant privatisation

దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్ల తరహాలో విశాఖ స్టీల్ ప్లాంటుకు కూడా సొంత గనులు కేటాయించడం,రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని సీఎం నిర్ణయించారు.

స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలకు ఉద్యో గులు కారణం కాదని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు కేటాయించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి.త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దేశ ద్రోహమేనని విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఇప్పటికే విశాఖ ఉక్కు ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.


Source link

MORE Articles

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే.. లింగోజిగూడలో పోటీకి దూరం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...

ఈ నగరానికి ఏమయ్యింది? కాకినాడ స్మార్ట్ సిటీనా, డెకాయిట్ సిటీనా!?

చిన్నప్పుడు ఎప్పుడూ షటిల్, టెన్నిస్ ఆడనివారు కూడా రాత్రి 6 నుండీ అర్ధరాత్రి 2 వరకూ కాకినాడ లో దోమల బ్యాట్ తో ప్రజలు అద్భుతమైన ఆటగాళ్లు అయిపోతున్నారు. 5వ అంతస్తులో ఉన్నా...

ఓఎల్‌ఎక్స్‌‌లో రెమిడిసివిర్ కరోనా ఇంజెక్షన్ విక్రయం, ధరంతో తెలుసా?

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. మరో కొత్త టీకా రెమిడిస్‌విర్‌ను కూడా అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే....

ఏపీలో నీటి ఎద్దడి.. తెలంగాణలో జలసిరులు… రివర్ బోర్డు లేఖ

రివర్ బోర్డు.. ఏపీ తాగునీటి అవసరాల కోసం అక్కడి ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా వాటర్ రివర్ బోర్డు లేఖ రాసింది. తాగునీటి అవసరాలకు...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe