పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులపై సెల్ టవర్ కూలి పడింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈదురు గాలులతో టవర్ కూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో భర్త సతీశ్(43) మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతపురం జిల్లా కూడేరు మండలం కడగళ్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కొడుకు తండ్రినే చంపాడు. ఓబన్నను ఆయన కొడుకు జయకృష్ణ మద్యం మత్తులో కొట్టి కిందకు తోయడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో పింఛను డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే తండ్రి జయకృష్ణ దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, జయకృష్ణను కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు తరచూ డబ్బుల కోసం తన తండ్రిని వేధించేవాడని గ్రామస్తులు తెలిపారు.