Monday, November 29, 2021

వీడియో: ప్రగ్యా ఠాకూర్‌ మళ్లీ చిక్కింది..ఒక ఆటాడుకుంటున్న కాంగ్రెస్

India

oi-Kannaiah

|

భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ ఏది చేసినా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ విమర్శలు సంధించింది. కోర్టుకు హాజరయ్యేందుకు అనారోగ్య కారణాలు చూపిన ప్రగ్యా ఠాకూర్ డ్యాన్స్‌లు మాత్రం ఇరగదీస్తోందంటూ సెటైర్లు వేశారు. తాజాగా మరో వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కరోనా టీకా తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ టీకాను ఆమె తన ఇంట్లో తీసుకుంది.

అయితే వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే వచ్చి ప్రభుత్వ యంత్రాంగం టీకాలు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా ఠాకూర్‌కు కూడా టీకా తొలి డోసు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ మాత్రం విమర్శలు సంధించింది. ఎంపీ బాస్కెట్ బాల్ ఆడారు, వివాహ వేడుకలో డ్యాన్స్ వేశారు అంతా బాగానే ఉన్నప్పుడు ఇంటికి సిబ్బందిని పిలిపించుకుని టీకా తీసుకోవడమేంటంటూ ప్రశ్నించింది కాంగ్రెస్. ప్రధాని మోదీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అంతా హాస్పిటల్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటుండగా.. ప్రగ్యా ఠాకూర్‌ మాత్రం సిబ్బందిని ఇంటికి పిలిపించుకుని టీకా వేయించుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజా.

Pragya Thakur takes covid shot at her residence, once again becomes a target for congress

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో టీకా వేయించుకునేందుకు టీకా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రగ్యా ఠాకూర్ తన అనారోగ్య కారణంగా కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపైనే ప్రత్యర్థులు మాటలతూటాలు పేల్చుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అబద్దాలు చెప్పి కోర్టుకు హాజరుకాకుండా ప్రగ్యా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతనెల బాస్కెట్ బాల్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కిన ఈ కమలం పార్టీ ఎంపీ… కొద్ది రోజుల క్రితం ఓ వెడ్డింగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.2008లో జరిగిన మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన ప్రగ్యా ఠాకూర్‌ 2017లో బెయిల్‌ పై విడుదలయ్యారు. ఆ పేలుళ్ల ఘటనలో ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. మోటార్‌సైకిల్‌లో బాంబును అమర్చి ఆ మోటార్ సైకిల్‌ను ఓ మసీదుకు సమీపంలో వదలి వెళ్లారు.

ఈ ఏడాది జనవరిలో తన కోర్టు హాజరకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై, ముంబై కోర్టు ఆరోగ్యపరమైన అంశాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

English summary

BJP MP Pragya Thakur was once again criticized by Congress after her video taking a covid jab at her residence went viral on social media.

Story first published: Friday, July 16, 2021, 16:43 [IST]




Source link

MORE Articles

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Sony’s impressive WF-1000XM4 earbuds fall to a new all-time low of $218 | Engadget

All products recommended by Engadget are selected by our editorial team, independent of our parent company. Some of our stories include affiliate links....

Benefits of raisin water: इस वक्त करें किशमिश पानी का सेवन, मिलेंगे जबरदस्त लाभ…

Benefits of raisin water Raisin water gives many benefits for health brmp | Benefits of raisin water: इस वक्त करें किशमिश पानी का...

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) విడుదల చేసిన ఈ వీడియోలో సుజుకి అవెనిస్ 125 యొక్క స్టైలింగ్ మరియు ఆధునిక ఫీచర్స్ వంటి వాటిని చూడవచ్చు. ఈ స్కూటర్...

Lady: బిడ్డను రూ. 2. 50 లక్షలకు అమ్మేసిన తల్లి, గంటలోనే డబ్బు లాక్కెళ్లారని ?, థ్రిల్లర్ సినిమా, మైండ్ బ్లాక్

భర్తతో విడిపోయిన భార్య చెన్నై సిటీలోని పుఝల్ ప్రాంతంలోని కవంకరైయ్యన్ ప్రాంతంలో యాస్మిన్ (29) అనే మహిళ నివాసం ఉంటున్నది. 11 సంవత్సరాల క్రితం యాస్మిన్ మోహన్ అనే...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe