వెంకీ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!

Date:

Share post:


టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజ‌న్, మేకింగ్ స్టైల్‌, డైలాగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తన సినీ కెరీర్‌లో దాదాపు స్టార్ హీరోల అందరితోనూ సినిమాలను రూపొందించి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ నుంచి రానున్న నెక్స్ట్ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. గ‌త కొన్ని రోజుల క్రితం వరకు బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని.. అది పాన్ ఇండియా లెవెల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని.. ఈ సినిమాతో సంచలనం సృష్టించడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Trivikram To Team Up With Venkatesh

కానీ.. అల్లు అర్జున్, అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమా సెట్స్‌లో అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మరింత సమయం పడుతుంది. ఇక త్రివిక్రమ్, బన్నీ కాంబోలో సినిమాకు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు టైం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే అసలు బన్నీతో సినిమానే త్రివిక్రమ్ విరమించుకున్నాడట‌. అందులో వాస్తవం ఎంతో తెలియాలంటే త్రివిక్రమ్ రియాక్ట్ అవ్వాల్సిందే. కాగా.. త్రివిక్రమ్ చివరగా రూపొందించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకొని తన సత్తా చాటాలనే కసితో ఉన్నాడు త్రివిక్రమ్.

Venky's Funny Reaction On Film With Trivikram

ఇక.. ప్రస్తుత సిచువేషన్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఖాళీగా లేరు. అల్లు అర్జున్ అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి.. హ్యాండ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వెంకటేష్‌తో సినిమా చేసి సక్సెస్ అందుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయం నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. అయితే.. ఈ విషయంపై స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన సన్నిహితులతో ముచ్చటించాడట. స్టోరీ లైన్, బ్యాక్ డ్రాప్ వివరాలు బయటకు రాలేదు కానీ.. త్రివిక్రమ్‌తో వెంకటేష్ సినిమా మాత్రం ఫిక్స్ అయిపోయిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక వీళ్ళ కాంబినేషన్‌లో గతంలో.. నువ్వు నాకు నచ్చావు సినిమా వచ్చి ఎలాంటి రిజల్ట్ అందుకుందో ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ వీళ్ళిద్దరి కాంబోలో రూపొందినన్న సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...