Tuesday, April 13, 2021

వైఎస్ వివేకా హత్య .. ఇంటి దొంగలున్నారా ? మీరే గొడ్డలి వేటేశారా ? వైఎస్ జగన్ టార్గెట్ గా టీడీపీ

మీ సొంత బాబాయి సంగతేంటి ? ఇప్పుడు మీరు సీఎం కదా… మరి మీ పై బాధ్యత లేదా? గోరంట్ల ప్రశ్న

సునీత రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ వేదికగా సునీత రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం పై జగన్ ను ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీ సొంత బాబాయి సంగతేంటి ? ఇప్పుడు మీరు సీఎం కదా… మరి మీ పై బాధ్యత లేదా? లేక దీని వెనుక ఇంటి దొంగలు ఉన్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు .

బాబాయ్ గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నా డా? లేక మీరే గొడ్డలి వేటేశారా? అయ్యన్న ప్రశ్న

బాబాయ్ గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నా డా? లేక మీరే గొడ్డలి వేటేశారా? అయ్యన్న ప్రశ్న

ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య ఎన్నికల సమయంలో సింపతి కోసం చేయించిన, వైసిపి నాయకుల హస్తం ఉన్న రాజకీయ హత్యగా ఇప్పటికే టిడిపి నేతలు అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తాజాగా మరోమారు జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కూడా వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబాయ్ గొడ్డలితో గుండెలపై పొడుచుకున్నా డా? లేక మీరే గొడ్డలి వేటేశారా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు.

 ఒక చెల్లి తెలంగాణాలో .. మరో చెల్లి ఢిల్లీలో .. అన్న కాదు అరాచకుడు అంటున్నారా ?

ఒక చెల్లి తెలంగాణాలో .. మరో చెల్లి ఢిల్లీలో .. అన్న కాదు అరాచకుడు అంటున్నారా ?

తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా జగన్ ను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఏ 2 దొంగ రెడ్డి అని సంబోధిస్తూ వైయస్ వివేకా హత్య పై చురకలంటించారు. ఓ చెల్లి తెలంగాణలో రోడ్లపైన, మరో చెల్లి ఢిల్లీలో .. అన్న కాదు అరాచకుడు అని నినదిస్తూ భయపెడుతున్నారా ? అని ప్రశ్నించారు . పంచాయతీలు ,మునిసిపాలిటీలు గెలిచామని కాలర్ ఎగరేస్తున్న ఏ 1 వలలు , బారికేడ్లు, 1000 మంది పోలీసులు కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడు అంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమయింది. సిబిఐ వాళ్ళు వస్తున్నారట .. హైదరాబాద్ లో కోవిడ్ బెడ్ లు రెడీ చేసుకో మరి సాయి రెడ్డి అంటూ అయ్యన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

వివేకా హత్య కేసు ఇంకా తేలకపోవటం , సునీతా రెడ్డి వ్యాఖ్యలతో టార్గెట్ అయిన జగన్

వివేకా హత్య కేసు ఇంకా తేలకపోవటం , సునీతా రెడ్డి వ్యాఖ్యలతో టార్గెట్ అయిన జగన్

గత ఎన్నికల కంటే ముందు మార్చి నెలలో వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన హత్య ఎందుకు జరిగింది? ఆయన హత్యకు పాల్పడిన వారెవరు ? అన్నది తేల్చలేకపోయారు. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం పోరాటం చేస్తున్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తన తండ్రి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సునీత రెడ్డి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ ఇంతకాలం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఏం చేశాడు అంటూ విరుచుకు పడుతున్నారు.


Source link

MORE Articles

Coronavirus छूने से नहीं फैलता, US की नई रिसर्च में दावा

वाशिंगटन: साल 2021 में जब कोरोना वायरस (Coronavirus) बहुत तेजी से फैल रहा था, तब हालत ये थी कि कुछ भी छूने से...

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

భారత్‌లో మూడో వ్యాక్సిన్.. మన దేశంలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను...

ఏపీలో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 4,228 కొత్త కేసులు ,10 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నమోదైన మొత్తం కేసులతో కలిపి...

Taiwan’s AppWorks leads $1m round in Vietnam healthtech startup

Docosan says it has helped 50,000 patients book appointments with doctors across 35 specialties within less than a year of operations. Source link

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ .. నేడు మార్గదర్శకాలు, నిబంధనలు వెల్లడించనున్న మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే !!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రకటన కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నిబంధనలను, మార్గదర్శకాలను ప్రకటించడానికి...

Elon Musk की Girlfriend ने बनवाया ‘Alien Tatoo’, शेयर की टॉपलेस Photo

वाशिंगटन: दुनियाभर के सबसे अमीर लोगों में शामिल एलन मस्क (Elon Musk) की गर्लफ्रेंड ग्राइम्स (Grimes) ने सोशल मीडिया पर एक टॉपलेस फोटो...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe