[ad_1]
షూ క్లీన్ చేయడానికి ఓ పెద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలతోనే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు.
దీని కావాల్సిందల్లా..
- సబ్బు
- నీరు
- మైక్రోఫైబర్ టవల్
- టూత్‌బ్రష్ (ఆప్షనల్)
Also Read : Push-ups : పుషప్స్ ఇలా చేస్తే మీ బాడీకి అస్సలు మంచిది కాదు..
ఎలా క్లీన్ చేయాలంటే..
ముందుగా క్లీన్ చేసేటప్పుడు చిన్న ప్లేస్‌లో మీరు వాడే క్లీనింగ్ సోప్‌ని వేయండి. అది సరిగ్గా పనిచేయకపోతే మొత్తం పాడవ్వకుండా ఉంటుంది. కాబట్టి, ముందుగానే ఇలా టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ముందుగా షూపై నీరు వేయండి. తర్వత సోప్ వేయండి కాస్తా రుద్దండి. టూత్ బ్రష్‌తో రుద్దండి. బాగా రుద్దాక.. గోరువెచ్చని నీరు పోయండి. కాసేపు ఉంచాక మళ్లీ టూత్ బ్రష్‌తో స్క్రబ్‌లా రుద్దండి.
ఇప్పుడు దీనిని నీటితో కడగాలి. మరకలు, నురగ పోయేవరకూ పూర్తిగా క్లీన్‌గా నీరు పోసి కడగండి. ఇలా క్లీన్ అయిన వీటిని పూర్తిగా ఆరేలా చూసుకోండి.
బేకింగ్ సోడాతో..
దీనికి కావాల్సింది..
- వెనిగర్
- బేకింగ్సోడా
- బ్రష్
- బౌల్
- గోరువెచ్చని నీరు
- టూత్ బ్రష్
Also Read : Vitamin D : విటమిన్ డి లోపంతో ఏమేం సమస్యలు వస్తాయంటే..
ఎలా చేయాలంటే..
- ముందుగా ఓ బౌల్‌లో ఓ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల వెనిగర్ వేయండి
- కొద్దిగా గోరువెచ్చని నీరు పోయండి
- మీకు కావాల్సిన క్వాంటిటీకి దీన్ని పెంచుకోవచ్చు.
- ముందుగా టూత్ బ్రూష్‌తో ఈ పేస్ట్‌ని తీసి షూ మీద రాయండి
- మొత్తం మరకలు దూరమయ్యేవరకూ ఇలానే చేయండి
- ఇప్పుడు షూని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి.
టూత్‌పేస్ట్‌తో..
- టూత్‌పేస్ట్..
- టూత్ బ్రష్..
ఎలా చేయాలంటే..
ముందుగా టూత్‌పేస్ట్‌ని షూపై మరకలపై రాయండి
దీనికోసం కేవలం పేస్ట్ అది కూడా వైట్ కలర్‌ది మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
దీనిని అప్లై చేసి 15 నిమిషాలు అలానే పెట్టండి.
తర్వాత షూని చల్లని నీటితో కడగండి
కడిగిన షూని ఆరబెట్టండి.
Also Read : Vitamin D : విటమిన్ డి లోపంతో ఏమేం సమస్యలు వస్తాయంటే..
వీటిని ఎప్పటికప్పుడు ఇలా నీట్‌గా చేయడం చాలా మంచిది. అప్పుడే కంటికి కనిపించని చాలా క్రిముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారవుతారు.
అదే విధంగా చాలా మందికి వాటిని ఎక్కువసేపు నీటిలో నానబెడతారు. ఇలా చేయడం వల్ల షూ పాడైపోయే ప్రమాదం ఉంది. వీటిని అప్పటికప్పుడు ఉంచి అలానే త్వరగా క్లీన్ చేయాలి. వీటిని క్లీన్ చేసేటప్పుడు మీరు బట్టలకు ఏది వాడుతున్నారో ఆ సోప్ వాడొచ్చు. అది కూడా తక్కువ పరిమాణంలోనే వాడాలని గుర్తుపెట్టుకోండి. అతిగా వాడడం వల్ల కూడా షూ త్వరగా పాడవుతాయని గుర్తించండి.
[ad_2]
Source link