[ad_1]
Calcification in arteries: మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో కాల్షియం ఒకటి. శరీరంలో అధిక మొత్తంలో ఉండే.. మినరల్ కూడా ఇదే. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. 70 శాతం ఎముకలు కాల్షియం, ఫాస్ఫేట్ తోనే తయారవుతాయి. నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొంతమంది కాల్షియం ఆరోగ్యానికి మంచిదనే భావనతో.. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. దీని కారణంగా.. శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాల్షియం స్థాయిలు మితిమీరితే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం అధికం మొత్తంలో తీసుకుంటే.. నరాలు, రక్తనాలాలో కాల్షియం పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీన్నే వాస్కులర్ కాల్సిఫికేషన్ అంటారు. సిరలలో కాల్షియం నిక్షేపాలు (calcification in arteries)సాధారణ సమస్యే, కానీ దాని స్థాయి ఎక్కువగా ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ సమస్యలా ప్రాణాంతకం కావచ్చని నిపుణులు అంటున్నారు. నరాలు, రక్తనాలాలో కాల్షియం పేరుకుంటే.. గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రక్తంలో కాల్షియం ఎందుకు పేరుకుంటుంది, దీన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
[ad_2]
Source link
Leave a Reply