శీతాకాలంలో పిల్లలకు.. అరటిపండు పెట్టవచ్చా..?

[ad_1]

Banana For Kids: చలికాలంలో.. పిల్లల ఆహార అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ సీజన్‌లో చిన్నారుల ఇమ్యూనిటీ తగ్గి.. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్‌ వంటి అనారోగ్యాలు వారిని చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితిలో, వారి రోగనిరోధక శక్తి పెంచడానికి పేరెంట్స్‌ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కాలంలో పిల్లలకు ఏ ఆహారం పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే సందేహాలు తల్లదండ్రులకు ఉంటాయి. ముఖ్యంగా, ఈ కాలంలో చిన్నారులకు అరటిపండు పెట్టవచ్చా? లేదా? అనే డౌట్‌లో ఉంటారు. కొంతమంది ఈ కాలంలో పిల్లలకు అరటిపండు పెడితే.. జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటూ ఉంటారు. అసలు దీనిలో ఎంత నిజం ఉంది? చిన్నారులకు శీతాకాలంలో అరటిపండు పెట్టవచ్చో? లేదో? తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఈ పోషకాలు ఉంటాయ్..

అన్ని కాలాలలోనూ చిన్నారులకు.. అరటిపండు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులోని పోషకాలు వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 , ఐరన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల డైట్‌లో అరటిపండు చేర్చడం వల్ల.. వల్ల వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది. అరటిపండు వారిని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఈ పండులో ఉండే.. విటమిన్ B6, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి నిద్రకు ఉపకరిస్తాయి.అరటిపండ్లు త్వరితంగా శక్తినిస్తాయి. ఇందులో శక్తినిచ్చే క్యాలరీలతోపాటు పోషకాలూ అత్యధికం. అరటిపండులో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లల్లో మలబద్ధకం ఉంటే.. నివారిస్తుంది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు రోజుకు 1 అరటిపండు తినే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 34 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లలకు అరటిపండు కచ్చితంగా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ.. వాతావరణం చల్లగా ఉంటే.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అరటి పండు పెట్టాలని సూచిస్తున్నారు.

అరటిపండు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. అరటిపండులో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది. అరటిపండు తినడం వల్ల పిల్లల ఎముకలు కూడా బలపడతాయి. శరీరంలోని రక్తహీనతను దూరం చేసే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఎలా పెట్టాలి..?

అరటిపండు పోషకాల స్టోర్‌ హౌస్‌ కాబట్టి.. ప్రతి సీజన్‌లో వారికి అరటిపండు పెట్టవచ్చు. కానీ చలి కాలంలో పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో.. పిల్లలకు ఎప్పుడూ ఎండలో కూర్చున్నప్పుడు అరటిపండు తినిపించాలి. ఎండలో కూర్చొని అరటిపండు తింటే జలుబు, దగ్గు వస్తుందనే భయం ఉండదు.

ఎప్పుడు పెట్టకూడదు..

పిల్లలకు ప్రతి సీజన్‌లో అరటిపండు పెట్టవచ్చని.. డాక్టర్‌ వివేక్‌ శర్మ(Dr. Vivek Sharma, consultant pediatrician at Penguin Pediatric Care and Eternal Hospital, Jaipur) అన్నారు. ఒకవేళ పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే.. వారికి అరటి పండు ఇవ్వకూడదని అన్నారు. ఆ సమయంలో అరటిపండు పెడితే.. పిల్లలకు కఫం పెరిగే అవకాశం ఉంది.

ఈ విధంగా పెట్టండి..

పిల్లలకు ఆరు నెలలు దాటిన తర్వత నుంచి అరటిపండు పెట్టవచ్చు. మిల్క్ షేక్ లు, ఫ్రూట్ సలాడ్ లు, క్రీము డేజర్ట్ ల రూపంలో తీసుకోవచ్చు. పిల్లలు దీని ఇష్టపడి తింటారు. పళ్లు రాని పిల్లలకు ప్యూరీ చేసి పెట్టండి.

రాత్రిపూట పెట్టొద్దు..

పండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరం. అయితే,, పండ్లు తినడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. రాత్రిపూట పిల్లలకు అరటిపండు పెట్టకూడదు. దీనివల్ల వారికి జీర్ణ సమస్యలు, కఫ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *