శీతాకాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యాలు రావు..!

[ad_1]

Winter Care Tips:శీతాకాలం అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ రోజుల్లో శ్వాసకి సంబంధించిన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. శీతాకాలం మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, దీంతో మనం సులభంగా అనారోగ్యానికి గురవుతాము. అదే సమయంలో, శ్లేష్మం కూడా సాధారణ సమయాల్లో కంటే.. ఈ సీజన్‌లో జిగటగా, మందంగా మారుతుంది. ఇది వాయు నాళాలను నిరోధిస్తుంది. ఈ కాలంలో కాలుష్యం, పొగమంచు, అల్జీలు, చలిగాలులు, దూళి కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని డాక్టర్‌ గౌరీ కులకర్ణీ (Dr. Gauri Kulkarni , Head of Medical Operations, MediBuddy) అన్నారు. ఈ కారకాల వల్ల.. శ్వాసకోశ సమస్యలు, సాధారణ జలుబు, దగ్గు, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, బ్రోన్కైటిస్, ఆస్తమా, COPD (దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)కి దారితీయవచ్చు. అందుకే చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్‌ గౌరీ కులకర్ణీ అన్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోండి..

చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఫ్లూ, జలుబుకు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడం మంచిదని డాక్టర్‌ గౌరీ కులకర్ణీ అన్నారు. కొవిడ్‌ బూస్టర్‌ తీసుకోకపోతే.. వెంటనే తీసుకోవాలని సూచించారు. వృద్ధులు.. న్యుమోకాకల్ టీకా వేయించుకోవాలని సిఫార్సు చేశారు. వ్యాక్సిన్లు అనారోగ్యాల బారిన పడకుండా రక్షిస్తాయని అన్నారు.

మాస్క్‌ ధరించండి..

ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు.. తప్పకుండా మాస్క్‌ ధరించాలని డాక్టర్‌ గౌరీ కలకర్ణీ సూచించారు. చలిగాలులు, వైరస్‌ల నుంచి మాస్క్‌ మనల్ని రక్షిస్తుంది. బయట కాలుష్యం, పొగమంచు మరీ ఎక్కువగా ఉంటే.. బయటకు వెళ్లకపోవడమే మంచిది.

నీరు ఎక్కువగా తాగండి..

చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. అంటే సరిపడా నీళ్లు తాగాలి, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ కాలంలో చలికారణంగా.. చాలా మంది నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా.. శరీరాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకోవాలని సూచించారు.

సూర్యరశ్మి పొందండి..

శీతాకాలంలో చలి కారణంగా.. చాలా మంది ఉదయం పూట బయటకు రారు. దీని కారణంగా.. సూర్యరశ్మి‌ పొందలేరు. విటమిన్‌ డీ లోపం కారణంగా.. ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. రోజూ ఉదయం పూట, సాయంత్రం కొంతసేపు సూర్యరశ్మిలో గడపాలని డాక్టర్‌ సూచించారు. దీనితో పాటు ఐరన్, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

ఇన్‌హేలర్‌ క్యారీ చేయండి..

మీరు.. ఆస్తమా, బ్రోన్కైటిస్‌, ఎంఫిసెమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే.. మీరు ఎల్లప్పుడూ ఇన్‌హేలర్‌లు మీ వెంట తీసుకువెళ్లండి. ఇంటి బయట భారీ వ్యాయామాలు చేయడం మానుకోండి. ఇండోర్‌ వర్కవుట్స్‌ ప్రిఫర్‌ చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *