శీతాకాలం ఈ పండు తింటే.. జలుబు, జ్వరం వచ్చే ఛాన్సే లేదు..!

[ad_1]

Immunity Boosting Food: శీతాకాలం మొదలైంది. ఈ కాలంలో జలుబు-దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. వింటర్‌లో ఇమ్యూనిటీ కూడా కొంత బలహీనపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరగడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మన డైట్‌లో తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన ఆహారంలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉండే పదార్థాలు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

టమాటా..

టమాటాలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం.. ఒక మీడియం సైజ్‌ పరిమాణంలో ఉన్న టమాటాలో రిఫరెన్స్ డైలీ ఇన్‌టేక్ (RDI)లో 28% అందిస్తుంది. టమాటాలో పొటాషియం, విటమిన్లు బి, ఏ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో తరచుగా మన డైట్‌లో టమాటా చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆరెంజ్‌..

ఆరెంజ్‌ విటమిన్‌ సీ స్టోర్‌ హౌస్. 100 గ్రాముల నారింజలో 53.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, కొల్లాజెన్‌ను పెంచుతుంది. చర్మా ఆరోగ్యానికి కొల్లాజెన్‌ మేలు చేస్తుంది. ఈ కాలంలో మీ రోజూ ఆరెంజ్‌ తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

బ్రకోలీ..

ఒక 100 గ్రాముల బ్రోకలీలో 89.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉందని నిపుణులు వెల్లడించారు. ఉడికించిన బ్రకోలీలో.. రోజువారీ అవసరానికి కావలసిన 57% విటమిన్‌ సీ అందుతుంది. బ్రకోలీలో ఫైబర్‌, ప్రొటీన్‌, పొటాషియం వంట పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. ఈ కాలంలో మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి బ్రకోలీ సహాయపడుతుంది.

క్యాప్సికమ్‌..

క్యాప్సికమ్‌లోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ క్యాప్సికంలో.. మన రోజూవారి అవసరాలకు కావలసిన 169% విటమిన్‌ సీ అందిస్తుంది. క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని కూడా పెంచుకోవచ్చు.

​కాలే..

ఇతర కూరగాయలతో పోలిస్తే కాలేలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల కాలేలో 120 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనిలో విటమిన్‌ ఏ, కె కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

స్ట్రాబెర్రీ..

ఈ రుచికరమైన పండులో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలోని పోషకాలు.. క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలో 90 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనిలో మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *