శృంగరానికి ముందు కానీ, తర్వాత వచ్చే తలనొప్పి కొన్నిసార్లు తేలిగ్గా ఉండొచ్చు. మరికొన్ని సార్లు తీవ్రంగా కూడా ఉండొచ్చు. ఇది ప్రాణాంతకమా.. దీని వెనుక కారణాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోండి.

​మాయో క్లినిక్ ప్రకారం..

చాలా మందికి శృంగారం చేయాలని ఇష్టంగా ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతారు. దీని తర్వాత రిలాక్స్‌ అయినట్లు భావిస్తారు. కానీ, కొంతమందికి మాత్రం అలా ఉండదు. దానిని ఎంజాయ్ చేయలేకపోతారు. దీనికి కారణం తలనొప్పి. మరి తలనొప్పి ఎందుకొస్తుంది. ఇది కార్యానికి ముందు కానీ, కార్యం తర్వాత అయినా వస్తుంది.

శృంగార సమయంలో వచ్చే తలనొప్పి రెండు రకాలు ఉంటాయి. వాటి గురించి కొన్ని విషయాలు చెబుతున్నారు. అదేంటంటే.. శృంగారం చేయాలనే ఉత్సాహం పెరిగేకొద్దీ ఆ యాంగ్జైటీతో మెడ, తలలో నొప్పి పెరుగుతుంది. ఉద్వేగం పెరిగే కొద్దీ ఈ నొప్పి కూడా ఎక్కువ అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇది కొన్నిసార్లు త్వరగా తగ్గుతుంది. కొన్నిసార్లు చాలాసేపటి వరకూ అలానే ఉంటుంది.

​ఎంత సమయం..

సాధారణంగా మాయో క్లినిక్ ప్రకారం ఇలా వచ్చిన తలనొప్పి కొన్నిసార్లు నిమిషాల్లో తగ్గిపోతుంది. మరికొందరికి 2 నుంచి 3 రోజుల వరకూ ఉంటుంది.

అయితే, ఈ నొప్పి కూడా ప్రతిసారి రావాలని లేదు. ఒక్కోసారి శృంగార సమయాల్లో వస్తుంది. కొన్ని సార్లు సంవత్సరం కంటే ఎక్కువ కాలం కూడా రాకపోవచ్చు అని హెల్త్ బాడీ చెబుతోంది.

అయితే, చాలా సందర్భాల్లో ఇది ఆరు నెలలకి ఒకసారి వస్తుంటుంది.

Also Read : Scarf styles : చలిలో స్కార్ఫ్‌ని ఇలా వేసుకోండి..

​కారణాలు..

ఇలా కలయికకి ముందు, తర్వాత వచ్చే తలనొప్పికి ఇతర ఆరోగ్య సమస్యల వల్లైనా రావొచ్చు. లేదా ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం వల్లైనా వస్తుంది. కొన్నిసార్లు ఇవి స్ట్రోక్, ఇంట్రాక్రానియల్ అనూరిజమ్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యల కారణంగా వస్తుంది.

కలయిక వల్ల వచ్చే తలనొప్పి జన్యువులతో సంబంధం కలిగి ఉంటుంది. ముందునుంచి ఎక్కువగా తలనొప్పి ఉన్నవారికి కూడా కలయిక వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read : Pongal Rangoli : ముగ్గులు అందంగా కనిపించాలంటే ఇలా వేయండి..

​తగ్గాలంటే ఏం చేయాలంటే..

అయితే, చాలా సందర్భాల్లో ఇది యాంగ్జైటీ కారణంగానే వస్తుంటుంది. కాబట్టి, ఆ యాంగ్జైటీ, ఒత్తిడిని దూరం చేసుకోవాలి. యోగా, ధ్యానం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. అదే విధంగా, పార్టనర్స్ కూడా కూర్చుని మాట్లాడుకోవాలి. దీని వల్ల చాలా వరకూ యాంగ్జైటీ చాలా వరకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Microwave Oven : వీటిని మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వేడి చేయకపోవడమే మంచిది..

​డాక్టర్‌ని ఎప్పుడు కలవాలంటే..

తలనొప్పి రెగ్యులర్‌గా వస్తే డాక్టర్‌ని కలవాలి. వీటితో పాటు కొన్ని లక్షణాలను కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దొని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

  • వాంతులు
  • వికారం
  • మైకం
  • మెడ నొప్పి
  • సరిగ్గా కనిపించకపోవడం
  • అలసిపోవడం
  • తిమ్మిరి

సమస్య ఏదైనా సరే కొద్దిగా ఉంటే పర్లేదు. కానీ, మరీ ముదురుతుంటే కచ్చితంగా డాక్టర్‌ని కలిసి మీ పరిస్థితి గురించి పూర్తిగా చెప్పాలి. వారి సలహాలు, సూచనలు పాటించాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *