Tuesday, June 22, 2021

శోభనం గది నుంచి గాయాలతో బయటకొచ్చిన నవ వరుడు… జరిగింది తెలిసి షాక్ తిన్న కుటుంబం…

అసలేం జరిగింది..

ఉత్తరప్రదేశ్‌లోని కుందా కుర్ద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ఓ సంబంధం తీసుకొచ్చాడు. అమ్మాయి,అబ్బాయి ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి ఖాయం చేసుకున్నారు. మార్చి 15న కుందా కుర్ద్ జిల్లాలోని బిజ్నోర్‌లో వీరి వివాహం జరిగింది. ఎట్టకేలకు తన పెళ్లయిందని… ఇక జీవితంలో స్థిరపడ్డానని ఆ వరుడు సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

శోభనం గదిలో భర్తపై విచక్షణారహితంగా దాడి...

శోభనం గదిలో భర్తపై విచక్షణారహితంగా దాడి…

పెళ్లి తంతు ముగిశాక వరుడితో కలిసి వధువు మెట్టినంట అడుగుపెట్టింది. అదే రోజు రాత్రి కొత్త జంటకు శోభనం జరగాల్సి ఉంది. తన భార్యతో మొదటిరాత్రి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోవాలని వరుడు కలలు కన్నాడు. కానీ శోభనం గదిలో అడుగుపెట్టాక అంతా తలకిందులైంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ నవ వధువు అతనిపై ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసింది. అనంతరం రూ.20వేలు నగదు,రూ.2లక్షలు విలువ చేసే నగలతో ఇంటి నుంచి ఉడాయించింది. శోభనం గది నుంచి వరుడు తీవ్ర గాయాలతో బయటకు రావడంతో అతని కుటుంబం షాక్ తిన్నది.

ఆస్పత్రిలో వరుడు...

ఆస్పత్రిలో వరుడు…

కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆపై పారిపోయిన వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వరుడు మాట్లాడుతూ…’అసలేం జరిగిందో నాకు కూడా అర్థం కాలేదు. ఇనుప రాడ్డుతో నా భార్య నాపై దాడి చేయడంతో సొమ్మసిల్లి పడిపోయాను. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక ఆ గది నుంచి బయటకొచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాను.’ అని తెలిపాడు. ఇటీవలే ఇదే ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్‌లోనూ ఈ ఘటన చోటు చేసుకుంది. నవ వధువు పెళ్లయిన 5గంటలకే నగలు,నగదుతో ఉడాయించింది.


Source link

MORE Articles

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : పీసీసీ పీఠం కోసం ఫైనల్ ఫైట్ : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ..!!

టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం చివరి దశకు చేరుకుంది. కొంత కాలంగా సీరియల్ లా సాగిపోతున్న ఈ అంశం పైన తేల్చేయటానికి ఏఐసీసీ సిద్దమైంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా...

అమెరికాలో నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కలలు సాకారమవుతున్న వేళ విషాదం

వర్జీనియాలో ఆర్కిటెక్ట్‌గా సాయి ప్రవీణ్.. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు విద్యాశాఖలో అసిస్టెంట్...

క్షత్రియ సమాజం వార్నింగ్ వెనుక : నేటి పత్రికల్లో మంత్రి కౌంటర్ : సంచయిత అదే వర్గంగా ..దుమారం ఆగదా..!!

క్షత్రియ సమాజం పేరుతో ప్రకటనతో.. ఆ ప్రకటనలో ....రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవ‌న విధానాన్ని సాగిస్తున్న సామాజిక వ‌ర్గం క్ష‌త్రియ స‌మాజం. మాలో నూటికి...

The one developer that publicly agreed to try Facebook’s VR ads is already backing away

Last Wednesday, Facebook announced that it would begin testing ads inside of Oculus Quest apps and said that the paid title...

Clubhouse is building a DM text chat feature – TechCrunch

Some Clubhouse users were treated to a surprise feature in their favorite app, but it wasn’t long for this world. A new UI...

HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models; terms of the deal were...

Kyle Wiggers / VentureBeat: HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models;...

Check out these Chromebook and laptop deals under $500 for Prime Day

There’s never a bad time to pick up a new laptop, and Prime Day means you’re pretty much out of excuses. You can...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe