ప్రస్తుతం బాక్సాఫీస్‌పై నాచురల్ స్టార్ నాని హిట్ 3 ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి లాభాల బాటలో దూసుకుపోతుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. నాని సరసన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు.. 2016 మిస్ సుప్ర నేషనల్ కిరీటాన్ని దక్కించుకుంది.
తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. కేజీఎఫ్ సినిమాతో నటిగా మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చి సంచలన విజయాలను అందుకున్న కేజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో శ్రీనిధి పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే ఊహించని రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ అమ్ముడు.. తర్వాత తమిళ్లో విక్రమ్‌తో కోబ్రా సినిమాలో నటించింది. ఇక ఇటీవల నాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమాలోను మెరిసింది.
ఇక ఎప్పుడు నవ్వుతూ అందచందాలతో చందమామల ఆకట్టుకునే శ్రీనిధి.. పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర విషాదాలను ఎదుర్కొందట. 14 ఏళ్ల వయసులోనే తాను తల్లిని కోల్పోయానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వివరించింది. తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. నేను పదో తరగతిలో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయానని.. ఆ టైంలో దేవుని పట్ల భక్తి, నమ్మకం అంతా ముక్కలైపోయినట్లు అనిపించిందంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేక బెంగళూరుకు వచ్చేసానని.. అక్కడ కొత్త మనుషులతో జీవిస్తూ పాత విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ వివరించింది.