Wednesday, May 18, 2022

శ్వాసనాళంలో విజిల్… 20 ఏళ్లుగా… ఎట్టకేలకు సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు…

National

oi-Srinivas Mittapalli

|

కేరళకు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్ల నుంచి దగ్గు సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమెకు దగ్గు నయం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను ఆమె సంప్రదించింది. వైద్య పరీక్షల్లో ఆమె శ్వాస నాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయినట్లు తేలింది. దగ్గు సమస్యకు ఇదే అసలు కారణమని గుర్తించిన వైద్యులు… శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించారు.

వివరాల్లోకి వెళ్తే… కన్నూరు జిల్లా మట్టన్నూర్‌కు చెందిన ఓ మహిళ(45) 25 ఏళ్ల వయసులో అనుకోకుండా విజిల్‌ను మింగేసింది. విజిల్ మింగిన విషయం ఆమె కూడా గుర్తించలేకపోయింది. అప్పటినుంచి ఆమె శ్వాసకోశ సమస్య,దగ్గుతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. బహువా అస్తమా వల్లే ఈ సమస్య వస్తోందని ఆమె భావించారు.

Kerala Doctors Remove Whistle Stuck In Womans Respiratory System For 20 Years

ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె కన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడ డా.రాజీవ్ రామ్ నేత్రుత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె శ్వాస నాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. శ్వాసనాళానికి అది అడ్డుగా ఉండటంతో ఆమె శ్వాసకోశ,దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు నిర్దారించారు.దీంతో ఆమె గొంతుకు శస్త్ర చికిత్స చేసి ఎట్టకేలకు విజిల్‌ను తొలగించారు. గత 20 ఏళ్లుగా ఆ విజిల్ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు ఇప్పుడు ఉపశమనం లభించినట్లయింది.

ఇటీవల యూకెలో ఓ 12 ఏళ్ల బాలుడు 54 అయస్కాంతాలను మింగిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. సర్జరీ ద్వారా బాలుడి కడుపులోని ఆ అయస్కాంతాలను తొలగించి వైద్యులు అతని ప్రాణాలు కాపాడారు. అయస్కాంతం మింగితే తన శరీరం కూడా మ్యాగ్నెట్‌లా మారి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుందా అన్నది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ బాలుడు ఇలా తనపై తానే ప్రయోగం చేసుకున్నాడు. చివరకు ఆ అయస్కాంతాలు బయటకు రాకపోవడంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సర్జరీ ద్వారా వాటిని తొలగించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe