Thursday, June 17, 2021

షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక అనుచరుడి ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూ

లంకపల్లిలో యువకుడి ఆత్మహత్య

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం, లంకలపల్లిలో శ్రీశైలం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారం నిర్వహించి, కీలక అనుచరుడిగా వ్యవహరించిన శ్రీశైలం.. ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న అతన్ని కుటుంబీకులు నల్గొండలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మల్లన్న ఓటమిని తట్టుకోలేక..

మల్లన్న ఓటమిని తట్టుకోలేక..

మర్రిగూడ మండలం, లంకపల్లికి చెందిన శ్రీశైలం విద్యాధికుడని, తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడని, రాష్ట్రంలో యువతకు జరుగుతోన్న అన్యాయాలపై, కేసీఆర్ సర్కారు తీరుపై గళం వినిపిస్తోన్న తీన్మార్ మల్లన్నకు శ్రీశైలం అభిమాని అని, తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో తీన్మార్ మల్లన్న ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకే శ్రీశైలం ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటనపై..

జగన్‌కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌

అవును శ్రీశైలం మావాడే..

అవును శ్రీశైలం మావాడే..

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాదించారు. శనివారం రాత్రి జరిగిన తుది లెక్కింపులో పల్లా గెలుపు ఖరారైంది. ఓవరాల్ గా పల్లాకు 1,61,811 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. కేవలం 12, 806 ఓట్ల తేడాతో మల్లన్న ఓటమిపాలయ్యారు. చివరిదాకా గట్టిపోటీ ఇచ్చిన మల్లన్న పరాజయాన్ని ఆయన అభిమాని శ్రీశైలం జీర్ణించుకోలేకపోయాడు. ఆత్మహత్య ఘటనపై తీర్మాన్ మల్లన్న స్పందించారు. శ్రీశైలం తమవాడేనని అన్నారు.

తెలంగాణలో మార్పు కోసం..

తెలంగాణలో మార్పు కోసం..

మృతుడు శ్రీశైలాన్ని తమ్ముడుగా అభివర్ణించిన మల్లన్న.. తనతోపాటు శ్రీశైలం కూడా పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు..

పార్టీలే ఆత్మహత్య చేసుకోవాలి..

పార్టీలే ఆత్మహత్య చేసుకోవాలి..

నల్గొండ జిల్లా లంకపల్లికి చెందిన శ్రీశైలం ఆత్మహత్య నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తన అభిమానులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ‘‘సోదరులారా రాబోయేది మన రాజ్యమే.. ఎవరూ ఆధైర్యపడకండి.. సూసైడ్ చేసుకోవాల్సింది మనంకాదు.. ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయపార్టీలు సూసైడ్ చేసుకోవాలి.. నా మీద అభిమానం ఉన్న సోదరులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని” అని మల్లన్న పేర్కొన్నారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe