Saturday, April 17, 2021

షాకింగ్ : బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎం తరలింపు… పోలింగ్ ముగిశాక.. అసోంలో వెలుగులోకి…

ఇలా బయటపడింది…

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రెండో విడత పోలింగ్ జరిగింది. రాత్రి 10.30గంటల సమయంలో కరీంగంజ్‌ జిల్లాలోని కనిసైల్ ప్రాంతంలో ఓ తెల్లరంగు బొలెరో కారు అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు గమనించారు. దీనిపై కారు డ్రైవర్‌ను ఆరా తీసేందుకు వెళ్లగా… అతను కారు దిగి పారిపోయాడు. ఎందుకిలా పారిపోయాడా అని కారు లోపల చూడగా… వెనుక సీట్లో ఒక ఈవీఎం మెషీన్ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న జర్నలిస్ట్ అతాను భుయాన్ అక్కడికి వెళ్లి ఆ సీన్‌ను వీడియో తీశాడు. ఆపై దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ కారు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృషేందు పాల్‌దేనని స్థానికులు చెప్తుండటం అందులో వినిపిస్తోంది.

ధ్రువీకరించిన ఎన్నికల కమిషన్...

ధ్రువీకరించిన ఎన్నికల కమిషన్…

ఆ కారు ఎమ్మెల్యే కృషేందు పాల్‌దేనని ఎన్నికల కమిషన్ కూడా ధ్రువీకరించింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో.. తన పేరిట AS 10B 0022 నంబర్‌ గల వైట్ బొలెరో కారు ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నాడని వెల్లడించింది. రతాబరిలోని ఎంవీ స్కూల్ పోలింగ్ కేంద్రం నుంచి ఆ ఈవీఎం మెషీన్‌ను తరలించినట్లు తెలిపింది. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఈసీ ఆదేశించింది. ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

ప్రియాంక గాంధీ ఫైర్…

ఎమ్మెల్యే కారులో ఏకంగా ఈవీఎం మెషీన్‌నే తరలిస్తూ పట్టుబడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్‌లో స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ…’ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఇలా ఈవీఎంలను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న వీడియోలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే… ఆ వాహనాలు బీజేపీ నేతలు లేదా వారి అనుచరులకు చెందినవై ఉంటాయి. ఈ వీడియోలను బయటపెట్టినవారినే నిందితులుగా చూపేందుకు బీజేపీ తన మీడియాను ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఇలాంటివి చాలా బయటపడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు ఈసీ తీవ్రంగా పరిగణించాలి.’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.




Source link

MORE Articles

Peloton is fighting a recall request on its treadmill after a child died last month

Peloton is resisting a request from the Consumer Product Safety Commission (CPSC) to recall its Tread Plus treadmill, which was involved...

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే.. లింగోజిగూడలో పోటీకి దూరం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe