Wednesday, April 14, 2021

షాకింగ్ : రోడ్డుకు సమీపంలో కుప్పలుతెప్పలుగా పాములు… షాక్ తిన్న స్థానికులు…

Telangana

oi-Srinivas Mittapalli

|

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ కలుగులో కుప్ప తెప్పలుగా పాములు బయటపడ్డాయి. మొదట ఒక పాము అందులో నుంచి బయటకు రాగా స్థానికులు చంపేశారు. ఆ తర్వాత మరో పాము బయటకు వచ్చింది. దాన్ని కూడా స్థానికులు చంపేశారు. కానీ ఆ తర్వాత కూడా అందులో నుంచి పాములు బయటకొస్తూనే ఉండటంతో వారు బెదిరిపోయారు. ఏంటా అని కాస్త ఆ కలుగులోకి తొంగిచూస్తే లోపల పాముల కప్పు కనిపించి షాక్ తిన్నారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపురం బస్టాండ్‌ ప్రధాన రహదారిలోని మంగలి లక్ష్మన్న బంక్‌ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంది. దాన్ని పక్కనే భూమిలోకి చిన్నపాటి రంధ్రం ఉంది. అందులో నుంచి మొదట ఓ పాము పిల్ల బయటకు రావడంతో స్థానికులు కొట్టి చంపేశారు. కానీ ఆ తర్వాత కాసేపటికి అదే కలుగులో నుంచి మరో పాము వచ్చింది. స్థానికులు దాన్ని కూడా చంపేశారు. కానీ ఆ తర్వాత కూడా వరుసబెట్టి ఆ కలుగులో నుంచి పాములు బయటకొస్తూనే ఉన్నాయి.దీంతో స్థానికులు బెదిరిపోయారు.

dozens of snakes found in a hole near a main road in gadwal district

ఆ కలుగు వద్దకు వెళ్లి కాస్త పరిశీలించి చూడగా లోపల కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. వెంటనే వాటన్నింటినీ చంపేసి పక్కనే ఉన్న పొదల్లో కాల్చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలను కొంతమంది సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొంతమంది జంతు ప్రేమికులు స్థానికుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాములు కనిపిస్తే స్నాక్ క్యాచర్స్‌కి లేదా అటవీ అధికారులకు సమాచారమివ్వాలని… అంతే తప్ప ఇలా చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పాములు సంచరిస్తే ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని… అందుకే వాటిని చంపేశామని స్థానికులు చెప్తున్నారు.

గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న బండ కింద పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటపడ్డాయి. మొదట ఓ పాము పిల్ల బయటకు రాగా ఆ ఇంటి యజమాన్ని దాన్ని చంపేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో పాము బయటకొచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఆ బండరాయిని పక్కకు తొలగించి చూడగా… దానికింద పదుల సంఖ్యలో పాములు కనిపించాయి.


Source link

MORE Articles

రోహిత్ సేన బ్యాటింగ్ లైనప్ వీక్: బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచుల్లో 5 వికెట్లు: స్కానింగ్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్,14వ ఎడిషన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన అయిదో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ సత్తాను చాటింది. కేప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలకు...

बाल झड़ने से हैं परेशान? अपनाएं ये सीक्रेट फार्मूला, फायदे हैरान कर देंगे

नई दिल्लीः बाल, शरीर का ऐसा हिस्सा है, जो इंसान की सुंदरता के लिए बेहद अहम माने जाते हैं. लेकिन आजकल बाल झड़ने...

गर्मियों में हर दिन करें एक कटोरी अंगूर का सेवन, मिलेंगे कमाल के फायदे

नई दिल्लीः गर्मियों के मौसम में सेहत का ध्यान रखना बहुत जरूरी होता है. क्योंकि इस मौसम में शरीर को विटामिन, कैल्शियम और...

Spotify’s Car Thing replaces your air vents with a smart music streaming device

Spotify has announced that its Car Thing experiment will become an official product that will ship to selected Spotify Premium customers.Car Thing, an...

Samsung Announces a Galaxy Unpacked Event on April 28 | Digital Trends

Samsung has announced its next Galaxy Unpacked event, where it will likely show off what’s next in its Galaxy product lines. This event...

Nvidia expects crippling GPU shortages to continue throughout 2021

If you’re waiting for the crippling graphics card shortage to loosen up before buying new hardware, well, you might be waiting for a...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe