International
oi-Rajashekhar Garrepally
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో అనేక దారుణాలు బయటికి రాకుండానే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో వార్త సంస్థలు, సోషల్ మీడియా కారణంగా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ దేశంలో మైనార్టీలపై దాడులు సాధారణం అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్‌కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు 14 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు, అతని ఫొటోలు బయటికి రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎంపీపై నెటిజన్లు తీవ్రంగా మడిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత, పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50ఏళ్ల ఎంపీ.. బలూచిస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006, అక్టోబర్ 28న జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది.
దీని ప్రకారం ఆ ఎంపీ.. 14 మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్లు తేలింది.
ఈ క్రమంలో స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికతో ఎంపీ వివాహంపై విచారణ జరిపారు. అయితే, తాము ఈ పెళ్లి చేయలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. కాగా, పాకిస్థాన్ చట్టాల ప్రకారం 16ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి వివాహం చెల్లదు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.