[ad_1]
ఈ లక్షణాలు కనిపిస్తాయి..
- కళ్ల మంటలు
- కాళ్ల జలదరింపు
- కాళ్లకు ఏదో తగిలిన అనుభూతి
- కాళ్లు వాపు
- కాళ్లలో సూది గుచ్చినట్లు అనిపిస్తుంది
- నడకలో మార్పు
- నడుస్తున్నప్పుడు పాదాలు తేలుతున్నట్లు అనిపిస్తుంది
- తరచుగా మూత్రవిసర్జన, తరచుగా మలవిసర్జన
- మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం
- అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు
షుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నా కూడా వారికి ఈ లక్షణాలు ఉండవచ్చు. ఇది నరాల దెబ్బతినడం వల్ల వస్తుంది.
ఈ సమస్యలు ఉన్నా..
పెరిఫెరల్ న్యూరోపతీ డయాబెటిస్ కారణంగానే కాదు.. విటమిన్ బి12 లోపం, రక్తనాళాల్లో వాపు (వ్యాస్కులైటిస్), థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం, బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానూ వచ్చే అవకాశం ఉంది.
పెరిఫెరల్ న్యూరోపతీకు బిల్వ పత్రం(మారేడు ఆకు)తో చికిత్స..
సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆకులే కాదు.. కాండం, కాయలు, పూలు, వేర్లలోనూ అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. మారేడు ఆకులో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. కెరోటిన్, విటమిన్ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఎలా తీసుకోవాలి..?
48 రోజులు/ 96 రోజులు ప్రతిరోజూ ఉదయం అర గ్లాసు వేడి నీటిలో పావు టీస్పూన్ మారేడు ఆకుల పొడి తీసుకుంటే, రక్తనాళాల్లో మార్పులను గమనించవచ్చు. ఈ ఆకులో ఉండే కౌమారిక్ యాసిడ్, మార్మెలోసిన్, umbelliferone నరాలను బలోపేతం చేస్తాయి. ఇది కాళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ తీసుకోవచ్చు. (image source – pixabay)
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- పెరిఫెరల్ న్యూరోపతీని నివారించాలంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
- బీపీ నియంత్రణలో ఉండాలి.
- కాళ్లను తరచుగా మసాజ్ చేయించుకోవాలి. రోజూ గోరువెచ్చటి నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. అయితే పాదాలను నీటిలో నానబెట్టొద్దు.
- పాదాలను నెమ్మదిగా తుడుచుకోవాలి. ముఖ్యంగా వేళ్ల మధ్య తడిలేకుండా చూసుకోవాలి.
- స్మోకింగ్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link