షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[ad_1]

ఎప్పుడైతే డయాబెటిస్‌ను 40 ఏళ్ల లోపు ఎదుర్కొంటారో దాన్నే ఎర్లీ ఆన్సెట్ టైప్ 2 డయాబెటిస్ అని అంటారు. 20 నుండి 30 ఏళ్లు ఉన్నవారిలో డయాబెటిస్‌కు సంబంధించిన లక్షణాలు కనబడుతుంటే వారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ విధంగా పట్టించుకోకపోతే మరింత ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే డయాబెటిస్‌కు సంబంధించిన మెడికేషన్, ట్రీట్మెంట్‌ను ఆలస్యం చేస్తారో, అప్పుడు ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది.

​కారణాలు..

చిన్న వయసులోనే డయాబెటిస్ ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాధారణంగా అందరూ ఎదుర్కొనే డయాబెటిస్‌క, టైప్ 2 డయాబెటిస్‌కు తేడా ఒకటే. అది ఏంటంటే ఎప్పుడైతే చిన్న వయసులో డయాబెటిస్‌ని ఎదుర్కొంటారో అప్పుడు కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక మనిషికి 20 ఏళ్ల వయసులోనే డయాబెటిస్ వస్తే ఆ వ్యక్తి 20 నుండి 35 ఏళ్లు తర్వాత కూడా అదే విధంగా బాధపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 50 నుండి 60 ఏళ్ల వారు డయాబెటిస్‌ని ఎదుర్కొంటారో వారికి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి.

ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే కేవలం అవే కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరి చిన్న వయసులోనే డయాబెటిస్ ఎదుర్కొంటే ఎలాంటి లక్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా దీన్ని పూర్తిగా చూసేయండి.

​తేడా ఇదే..

సాధారణమైన డయాబెటిస్, ఎర్లీ ఆన్సెట్ టైప్ 2 డయాబెటిస్‌కు లక్షణాలు ఒకటే. అవే దాహం ఎక్కువగా ఉండటం, యూరినేషన్, నీరసంగా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడం, దెబ్బలు తగిలిన చోట మానకపోవడం వంటి మొదలగు లక్షణాలు కనబడతాయి. 40 ఏళ్లు లోపు ఉండే వారిలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా రావడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. చిన్న వయసులోనే డయాబెటిస్ సమస్య రావడానికి కారణం ఉబకాయం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : During Romance : శృంగార టైమ్‌లో ఆడవారు దాని గురించి అబద్దం చెబుతారట..

​వీటికి దూరంగా ఉండాల్సిందే..

ఎప్పుడైతే అనారోగ్యపు అలవాట్లు చేసుకుంటారో ముఖ్యంగా జంక్ ఫుడ్, క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, పంచదార, కొవ్వు కలిగేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా శాతం మంది ఆహారాన్ని నియంత్రించడం మాత్రమే కాకుండా ఎలాంటి వ్యాయామాలను కూడా చేయరు. దానివల్ల మరింత ప్రమాదం ఉంది అని చెప్పవచ్చు.

Also Read : Vision : ఇలా చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయట..

​ఒత్తిడి వద్దు..

డయాబెటిస్ సమస్య రావడానికి కారణం ఇంకొకటి ఉంది అదే ఒత్తిడి. ఒత్తిడి వలన కూడా డయాబెటిస్ వస్తుందని అని చాలా మందికి తెలియదు. అయితే చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా అని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం, వారి కుటుంబంలో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.40 ఏళ్ల లోపు డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

​జీవనవిధానం

ఎప్పుడైతే జీవన విధానాన్ని మార్చుకుంటారో అప్పుడు డయాబెటిస్ రాకుండా జీవించవచ్చు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని, కార్బోహైడ్రేట్, ఇతర క్యాలరీలను తగ్గించుకుంటూ ఉండాలి. కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా వ్యాయామాల పై కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఊబకాయం డయాబెటిస్‌కు గురిచేస్తుంది, కాబట్టి వీలైనంతవరకు బరువును నియంత్రించుకోండి. వీటన్నిటితో పాటుగా నిద్ర కూడా ఎంతో అవసరం కాబట్టి నిద్ర పై కూడా దృష్టి ఉంచాలి. ఒత్తిడికి గురవకుండా మీ రోజును ప్లాన్ చేసుకోండి. చిన్న వయసులో డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటే ఈ చర్యలను తప్పకుండా పాటించండి. ఎందుకంటే వీలైనంత త్వరగా నియంత్రించుకోకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి సరైన మెడికేషన్‌తో పాటుగా జీవన విధానంపై కూడా దృష్టి పెట్టండి.

​శారీరక వ్యాయామం

నిజానికి మెడికేషన్ ఎంత అవసరమో శారీరక వ్యాయామాలు కూడా అంతే అవసరమని గుర్తుంచుకోండి. చాలా మంది వ్యాయామాల కొరకు సమయాన్ని అస్సలు కేటాయించారు. హై ఇంటెన్సిటీ వ్యాయామాలను చేయలేకపోతే కేవలం మోడరేట్‌గా అయినా చేయవచ్చు. అంటే కాస్త దూరం నడవడం, ఇంట్లో పనులు చేయడం, గార్డెన్ లో పని చేయడం, 20 కేజీల వరకు బరువు ఉండేటువంటి వస్తువులను ఎత్తడం, డాన్స్, మెట్లు ఎక్కడం మరియు దిగడం వంటివి చేయవచ్చు. ఈ విధంగా చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మీ ఆరోగ్య పరిస్థితి ప్రకారం డాక్టర్ ని సంప్రదించి మాత్రమే వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి అని గుర్తుంచుకోండి.

​ఐదు శాతం బరువు తగ్గాలి..

ఎప్పుడైతే మీ బరువును తగ్గించుకుంటారు అప్పుడు మెటమాలిజం మెరుగ్గా ఉంటుంది మరియు ఇతర కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. మీరు తీసుకునేటువంటి రోజు వారి ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి మరియు కార్బోహైడ్రేట్స్ వంటివి తగ్గించేస్తే మంచిది, అంటే పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుని క్యాలరీలను కంట్రోల్ లో ఉంచితే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సరైన జీవన విధానాన్ని కూడా పొందుతారు. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఉన్నవారు క్రాష్ డైట్ వంటి వాటిని అసలు పాటించవద్దు, అంతేకాకుండా స్వయంగా ఎలాంటి డైట్ కూడా చేయకూడదు.

​స్మోకింగ్..

స్మోకింగ్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలిసిందే. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడుతుంటే స్మోకింగ్ అసలు చేయకూడదు అని గుర్తుంచుకోండి. కాబట్టి వీలైనంత స్మోకింగ్ కు దూరంగా ఉండండి. ఒత్తిడిని తగ్గించుకోండి మ్యూజిక్, డాన్స్, కౌన్సిలింగ్, మెడిటేషన్ మరియు యోగ వంటి ఏ విధమైన యాక్టివిటీ ద్వారా అయినా ఒత్తిడిని తగ్గించుకోండి.

Also Read : Weight loss fruits : ఈ పండ్లు తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందట..

iStock-534083583

istock-534083583

నిద్ర

ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. కేవలం 7 గంటల అయినా నిద్రపోతే డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుని ఆరోగ్యంగా జీవించండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *