షేర్లను తాకట్టు కొట్టుకు పంపుతున్న ప్రమోటర్లు, ఈ స్టాక్స్‌ మీ దగ్గర ఉంటే జర జాగ్రత్త!

Byprakshalana

Nov 17, 2023 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


Stock Market News in Telugu: రోజువారీ కార్యకలాపాల కోసం, భవిష్యత్‌ పెట్టుబడుల కోసం కంపెనీలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం… అప్పులు చేయడం, వాటాలు అమ్మడం సహా వివిధ మార్గాల్లో కంపెనీలు ఫండ్‌ రైజ్‌ చేస్తాయి. షేర్లను తాకట్టు పెట్టే విధానం (pledging of shares) కూడా వాటిలో ఒకటి. కంపెనీలో వాటా పెంచడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ప్రమోటర్లు (promoters pledged shares) తమ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెడుతుంటారు. కొన్నిసార్లు… తమ వ్యక్తిగత అవసరాల కోసం కూడా తమ వద్ద ఉన్న షేర్లను తాకట్టు పెడుతుంటారు. చాలా కంపెనీల్లో జరిగే వ్యవహారమే ఇది.

ఏ అవసరం కోసం షేర్లను ప్లెడ్జ్‌ చేసినా, దానిని ఆ కంపెనీకి ఒక నెగెటివ్‌ ఫ్యాక్టర్‌గానే మార్కెట్‌ భావిస్తుంది. ఎంత ఎక్కువ మొత్తం షేర్లు తనఖాలో ఉంటే, అంత ఎక్కువ నెగెటివ్‌ సెంటిమెంట్‌ కనిపిస్తుంది. ఇప్పటికే తాకట్టులో ఉన్న షేర్లు క్రమంగా తగ్గుతుంటే, అది ఆ కంపెనీకి పాజిటివ్‌ ట్రిగ్గర్‌గా.. షేర్ల తనఖా క్రమంగా పెరుగుతుంటే నెగెటివ్‌ ట్రిగ్గర్‌గా ఆ స్టాక్‌ మీద పని చేస్తుంది. స్టాక్‌ఎడ్జ్ డేటా ప్రకారం, 2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో (Q2 FY24) 8 లార్జ్‌ క్యాప్‌ & మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో (large cap firms & mid cap firms) ప్రమోటర్ల ప్లెడ్జ్‌ పెరిగింది.

జులై-సెప్టెంబర్‌ కాలంలో ప్రమోటర్‌ ప్లెడ్జ్‌ పెరిగిన 8 కంపెనీలు: 

ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank promoters pledge)
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 1.8% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 45.5%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 47.3%కి చేరింది. 

రామ్‌కో సిమెంట్స్  (Ramco Cements promoters pledge)
రామ్‌కో సిమెంట్స్ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ Q2 Y24లో 1.1% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 21.1%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 22.2%కి చేరింది. 

అదానీ పవర్  (Adani Power promoters pledge)
అదానీ పవర్‌ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.9% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 25.1%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 26%కి చేరింది. 

సంవర్ధన మదర్సన్  (Samvardhana Motherson promoters pledge)
సంవర్ధన మదర్సన్ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 1.9%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 2.3%కి చేరింది. 

అరబిందో ఫార్మా  (Aurobindo Pharma promoters pledge)
అరబిందో ఫార్మా ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.4% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 19.2%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 19.6%కి చేరింది. 

JSW ఎనర్జీ  (JSW Energy promoters pledge)
JSW ఎనర్జీ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.3% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 12.4%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 12.8%కి చేరింది. 

జూబిలెంట్ ఫుడ్ వర్క్స్  (Jubilant FoodWorks promoters pledge)
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.2% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 0.6%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 0.8%కి చేరింది. 

సన్ ఫార్మా  (Sun Pharma promoters pledge)
సన్ ఫార్మా ప్రమోటర్ల ప్లెడ్జ్‌ సెప్టెంబర్ త్రైమాసికంలో 0.1% పెరిగింది. జూన్ క్వార్టర్‌లో, ప్రమోటర్లు తాకట్టు పెట్టిన మొత్తం వాటా 2.3%గా ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 2.4%కి చేరింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: సమ్మె బాటలో బ్యాంకులు, డిసెంబర్‌ ప్రారంభం నుంచే స్ట్రైక్‌ షురూ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *