సమంత సెన్సేషనల్ డెసిషన్.. తెలుగు నిర్మాతలకు బిగ్ షాక్ తప్పదా..!

Date:

Share post:


స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలం పాటు ఇండ‌స్ట్రీనిషేక్ చేసిన ఈ అమ్మ‌డు దాదాపు ఇక్కడ అగ్ర హీరోల అంద‌రితోను నటించి మెప్పించింది. కాగా తాజాగా సామ్ తీసుకున నిర్ణ‌యం సోష‌ల్ మాడియాలో వైరల్ గా మారుతుంది. సమంత తన సినీ కెరీర్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకున్న అది ఎప్పుడు సంచలనమే. ఈ క్ర‌మంలో తాజాగా సామ్ తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి. హీరోలతో సమానంగా తనకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని సమంత కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఇంతకీ సమంతా ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు కానీ.. సమంత నిర్ణయానికి తెలుగు, నిర్మాతలు ఒప్పుకుంటారా.. లేదా.. అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్.

ఈ డెసీష‌న్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. సమంత ఇకపై తెలుగు సినిమాల్లో నటించాలంటే హీరోలకు సమానంగానే రెమ్యున‌రేష‌న్‌ ఇవ్వాల్సిందేనంటూ కరాకండిగా తేల్చి చెప్పేసిందట. లేకపోతే.. క‌థ‌ ఎంత బాగున్నా సరే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. డేట్ లు ఇవ్వడం కుదరదని వివరించిందట. ఇప్పటికే ఈ విషయాలన్నీ ఎంతమంది నిర్మాతలతో తేల్చి చెప్పేసిందని.. ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే కేవలం హీరో మాత్రమే కాదు.. హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.. అలాంటి కృషికి తగ్గట్లే గౌరవం కూడా దక్కాలి కదా.. అని సమంత వారికి వివరించిందట.

ఇక గత కొంతకాలంగా గ్లోబల్ లెవెల్లో వెబ్ సిరీస్లలో నటిస్తూ తన రేంజ్‌ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్న సమంత.. ఈ నేపథ్యంలోనే సొంత బ్యానర్ పై రూపొందించే సినిమాలకు సైతం.. నటీనటులకు సమానమైన రెమ్యున‌రేషన్ ఇవ్వాలని కండీష‌న్ పెట్టుకుంద‌ట‌. అలా ఈ డేసిషన్ తీసుకుందట. అయితే సమంత తీసుకున్న ఈ నిర్ణ‌యానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇక సమంత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. కచ్చితంగా వెనక్కు తగ్గే అవకాశం ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి ఈ నిర్ణయంతో.. మ‌రింత‌మంది ముద్దుగుమ్మ‌ల‌ను ఇన్‌ఫ్లుయ‌న్స్ చేస్తే.. తెలుగు నిర్మాతలకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న‌డంలో అతి శ‌యోక్తి లేదు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...