Saturday, May 8, 2021

సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి

National

oi-Harikrishna

|

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి డా. ఎం.ఏ. ఇబ్రహీమీ రాసిన యాత్ర అనుభవాల పుస్తకం ‘ది బ్యూటిఫుల్ వరల్డ్’ (అందమైన ప్రపంచం) పుస్తకాన్ని ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సమాజం, మానవ వికాసం, నూతన సంస్కృతులు, ఆచార వ్యవహారాల గురించి ఉపన్యసించారు ఉప రాష్ట్రపతి.

ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి సమాజాల ప్రభావాల పైన తన స్వీయ అనుభవాలను నెమరువేసుకున్నారు. తన జీవితంలో సింహభాగం సమాజం నుంచే నేర్చుకున్నానన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో పర్యటించానని, నేటికీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, వివిధ విశ్వవిద్యాలయాలను, విజ్ఞాన కేంద్రాలను సందర్శించడంతో పాటు విద్యార్థులు, శాస్త్రవేత్తలతో మాట్లాడడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో సృజనాత్మకత, సమాజం పట్ల అవగాహన పెరిగేందుకు ఇలాంటి యాత్రలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డా. ఇబ్రహిమి తమ యాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకంలోని అంశాలు చదువరులకు వివిధ సంస్కృతుల గురించి తెలియజేయడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Source link

MORE Articles

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

कब खत्म होगी कोरोना की दूसरी लहर? वैज्ञानिकों ने बताया सही टाइम…जानें

नई दिल्ली: इस वक्त कोरोना की दूसरी लहर ने देश में कोहराम मचा रखा है. रोजाना रिकॉर्ड मामले सामने आ रहे हैं. हजारों...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe