సమ్మె బాటలో బ్యాంకులు, డిసెంబర్‌ ప్రారంభం నుంచే స్ట్రైక్‌ షురూ!

Byprakshalana

Nov 17, 2023 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


Bank Employees Strike In December 2023: మన దేశ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంక్‌లు కూడా ఒక భాగం. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, ప్రతి వ్యక్తికి బ్యాంక్‌తో పని ఉంటుంది. వచ్చే నెలలో ప్రజలు బ్యాంకింగ్‌ కష్టాలు (banking services will be hit in December 2023) ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 

డిసెంబర్‌ నెలలో చాలా రోజుల పాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు, ఆ సమ్మె రోజుల్లో బ్యాంకు సేవలు ప్రజలకు అందవు. బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మెపై, ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ (AIBEA) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 2023లో, వేర్వేరు తేదీల్లో బ్యాంకుల్లో సమ్మెను AIBEA ప్రకటించింది. PTI రిపోర్ట్‌ ప్రకారం, బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె (Bank Employees Strike in 2023 December 4th to 11th) డిసెంబర్ 4న ప్రారంభమై, డిసెంబర్ 11 వరకు  కొనసాగుతుంది. 

డిసెంబర్ 2023లో ఈ రోజుల్లో ఈ బ్యాంకుల్లో ఉద్యోగుల సమ్మె:

డిసెంబర్ 4, 2023- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌ ‍‌(Employees Strike in SBI, Punjab National Bank, Punjab & Sind Bank)
డిసెంబర్ 5, 2023- బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (Employees Strike in Bank of Baroda, Bank of India‌)
డిసెంబర్ 6, 2023- కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Employees Strike in Canara Bank, Central Bank of India)
డిసెంబర్ 7, 2023- ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌ (Employees Strike in Indian Bank, UCO Bank)
డిసెంబర్ 8, 2023- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Employees Strike in Union Bank Of India, Bank of Maharashtra)
డిసెంబర్ 9 & 10, 2023- బ్యాంకులకు రెండో శనివారం & ఆదివారం సెలవులు
డిసెంబర్ 11, 2023- ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సమ్మె (Private Bank Employees Strike)

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు (Demands of bank employees)
బ్యాంకులో పని చేయడానికి సరిపడా సిబ్బంది ఉండాలన్నది బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌. దీంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో ఔట్ సోర్సింగ్‌ సేవలను నిషేధించడం ద్వారా శాశ్వత ఉద్యోగాల సంఖ్యను పెంచడం, మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగుల వల్ల, బ్యాంక్‌ కస్టమర్ల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడుతుందని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

బ్యాంక్‌ కస్టమర్లకు సమస్యలు
AIBEA ప్రతిపాదించిన సమ్మె కారణంగా, బ్యాంక్ కస్టమర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. బ్యాంక్‌ ఉద్యోగుల స్ట్రైక్‌ డిసెంబరు 4 – 11 తేదీల మధ్య వివిధ బ్యాంకుల్లో జరుగుతుంది. అవే రోజుల్లో బ్యాంక్‌లో మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఆ పని నిలిచిపోవచ్చు. కాబట్టి, బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె తేదీలను (Bank employees strike dates) గుర్తు పెట్టుకుని  ముందే జాగ్రత్త పడండి. బ్యాంక్‌ బంద్‌ ముందు రోజునో, తర్వాత రోజునో మీ పని పూర్తి చేసుకోండి.

మరో ఆసక్తికర కథనం: నష్టాల్లో ప్రారంభమైనా పుంజుకుంటున్న స్టాక్‌ మార్కెట్లు, బ్యాంక్‌ షేర్లు డీలా

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *