Tuesday, September 21, 2021

సర్దార్ పటేల్‌కు ఘోర అవమానం -మహానేత పేరు తీసి, స్టేడియానికి మోదీ పేరా? -బీజేపీ వచన: హార్దిక్

పటేల్‌ను అవమానించిన బీజేపీ

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ ప్రాంగణంగా ‘నరేంద్ర మోదీ స్టేడియం’ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో మంత్రి కిరన్ రిజిజు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులు బుధవారం ప్రారంభించారు. భారత్ లో తొలిసారిగా పింక్ బాల్ తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్(భారత్, ఇంగ్లాండ్ మధ్య) మ్యాచ్ కు ఈ స్టేడియం వేదిక కానుంది. వసతుల పరంగా అత్యద్భుతంగా ఉన్నప్పటికీ, స్టేడియం పేరును మార్చేయడం ద్వారా పటేల్ ను బీజేపీ అవమానించిందని గుజరాత్ కాంగ్రెస్ యువ నేత, పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు..

క్రికెటర్ మనోజ్ తివారీ అనూహ్యం -మోదీని కాదని దీదీకి జై -టీఎంసీలో చేరిక -బెంగాల్ ఎన్నికల వేళ..

సర్దార్ పేరుతో ఓట్లు అడిగారే..

సర్దార్ పేరుతో ఓట్లు అడిగారే..

‘‘అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇప్పుడు దీనిని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గా పేరు మార్చారు, ఇది ముమ్మాటికీ సర్దార్ పటేల్‌ను అవమానించడం కాదా? సర్దార్ పటేల్ పేరిట ఓట్లు అడుక్కున్న బీజేపీ.. ఇప్పుడు అదే సర్దార్ సాహెబ్‌ను అవమానిస్తోంది. పెద్దాయనకు జరిగిన ఈ అవమానాన్ని గుజరాత్ ప్రజలు ఎన్నటికీ సహించబోరు” అని హార్దిక్ పటేల్ మండిపడ్డారు. సర్దార్ ను తమవాడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోన్న బీజేపీ ఇంత అనాలోచితంగా ఆయన పేరును తొలగించిందా? అంటే మాత్రం..

సబర్మతి అవతలి ఒడ్డున స్పోర్ట్స్ ఎంక్లేవ్

సబర్మతి అవతలి ఒడ్డున స్పోర్ట్స్ ఎంక్లేవ్

మోతేరా స్టేడియంగా వాడుకలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడం పెద్ద విషయమే అయినప్పటికీ, దానిపై వివాదం రేగకుండా బీజేపీ పకడ్బందీగానే ప్లాన్ గీసింది. అమ్మదాబాద్ సిటీ గుండా వెళ్లే సబర్మతి నదికి ఈ ఒడ్డున మోదీ స్టేడియం ఉంటే, అవతలి ఒడ్డున మరోసారి సర్దార్ పటేల్ పేరుతో భారీ స్పోర్ట్స్ ఎంక్లేవ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఇవాళే భూమి పూజ కూడా నిర్వహించారు. పటేల్ పేరుతో నిర్మించబోయే కొత్త ఎంక్లేవ్ లో 50వేల మంది కూర్చునే అథ్లెటిక్, ఫుట్ బాల్ స్టేడియం, హాకీ, మల్టీపర్పస్ గ్రౌండ్లు, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాక్సింగ్.. ఇలా సకల క్రీడలకు వేదికలను నిర్మించబోతున్నారు.


Source link

MORE Articles

Alzheimer’s Disease: इस लाइलाज बीमारी की शुरुआत में मिलने लगते हैं ये संकेत, तुरंत उठाएं ये कदम

Alzheimer's Day: 21 सितंबर को पूरे विश्व में वर्ल्ड अल्जाइमर डे (World Alzheimer's Day 2021) के रूप में मनाया जाता है. यह एक...

Royal Enfield రైడింగ్ జాకెట్ కొనాలంటే.. ఇలా చేయండి

Royal Enfield కంపెనీ తీసుకువచ్చిన ఈ కార్యక్రమం అతి తక్కువ కాలంలోనే చాలా ఆదరణ పొందగలిగింది. కంపెనీ ఇప్పుడు ఇందులో ఇప్పుడు రైడర్ జాకెట్స్ కూడా అందించనున్నట్లు తెలిపింది....

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe