‘సర్దుకోండి’ ప్లీజ్‌

Date:

Share post:


– ఇంటింటికి తిరిగిన మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌
– బుజ్జగింపులు… ఓదార్పులు… హెచ్చరికలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఆరు ఖాళీలకుగానూ ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక పోవ డంతో ఆ పదవి ఆశిస్తున్న మిగతా ఎమ్మెల్యేలు అలకపాన్పు లెక్కారు. అంతేకాకుండా తమ అనుయాయుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌పై అసం తృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మంత్రి పదవి మాకివ్వరా? అంటూ రకరకాలుగా ముఖం చాటేస్తున్నారు. దీంతో అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. వారి ని బుజ్జగించే పనిలో పడిం ది. ఇంటింటికి తిరిగి వారిని సముదాయి స్తున్నారు. ఈ దఫా ముగ్గురికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం వెనుక ఉన్న పరిస్థితులను రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఇంటింటికి తిరిగి వారిని బుజ్జగిం చారు. ఓదా ర్చారు. అయిన్నప్పటికీ వారు ఇంకా శాంతించ లేదని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల పేర్లు ప్రకటిం చగానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి అజ్ఞాతంలోకి పోయినట్టు వార్తలొస్తున్నాయి. ఫోన్లు స్వీచ్ఛాప్‌ చేశారు. ఎక్కడా ఉన్నారో తెలియక సొంత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నిక లకు ముందు ఆయనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీ నేప థ్యంలో ఆయనకు పదవి తప్పకుండా వస్తుందన్న ప్రచారం బలంగా జరిగింది. ఇప్పుడు అది నిజం కాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ సారి రెడ్డి సామాజిక తరగతికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి కూడా బలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆ పదవి కోసం మల్‌రెడ్డి దీక్షలు కూడా చేశారు. కానీ ఆయనకు బెర్తు దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి, తన మనోవేదనను చెప్పాలని ప్రయత్నించారు. కానీ టీపీసీసీ అధ్యక్షులు జోక్యం చేసుకోవడంతో ఆయన తన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేసుకు న్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి పి. సుదర్శన్‌రెడ్డికి బెర్తు దాదాపు ఖాయమైనట్టు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషం లో ఆయనకూ ఆ పదవి దక్కలేదు. వీరితోపాటు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పేరు కూడా ఆదిలాబాద్‌ నుంచి బలంగా వినిపించింది. అక్కడి నుంచి జి. వివేక్‌ వెంకట స్వామికి మంత్రి పదవి దక్కడం తో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ ఎస్టీ కోటాల్లో మంత్రి పదవి వస్తుందనీ, ఆయనకు సీనియర్‌ నేత జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆయన కూడా మంత్రి పదవి వస్తుందనే నమ్మకం పెట్టుకున్నారు. అదే సామాజిక తరగతి నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవి రావడంతో ఆయనకు మంత్రి పదవి వెనక్కి పోయిందని పార్టీ వర్గాలు చెప్పాయి.

సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత : మహేశ్‌కుమార్‌గౌడ్‌
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యతకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు. కుల సర్వే, ఎస్సీ వర్గీక రణ ఆధారంగా మంత్రి పదవుల కేటాయింపులు చేసినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి పదవులు ఆశించిన వారి ఆవేదనను పార్టీ అర్థం చేసుకున్నట్టు తెలిపారు. రానున్న రోజు ల్లో రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేసేం దుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.

The post ‘సర్దుకోండి’ ప్లీజ్‌ appeared first on Navatelangana.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...