సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూత- ప్రముఖుల సంతాపం

Byprakshalana

Nov 15, 2023 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


Sahara Group Chief Subrata Roy Died: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మంగళవారం (14 నవంబర్ 2023) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. రిటైల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో రాయ్ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు.

సుదీర్ఘకాలంగా రక్తపోటు, మధుమేహం సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుబ్రతా రాయ్ రాత్రి 10.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. “మా సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ యాక్టివిస్ట్, ‘సహారాశ్రీ’ చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా కన్నుమూశారని ప్రకటించడం చాలా బాధాకరం” అని గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆయనను స్ఫూర్తిదాయక నేతగా, దార్శనికుడిగా అభివర్ణిస్తూ, ఆయన మరణంతో కలిగిన నష్టాన్ని సహారా ఇండియా కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంది. సహారా శ్రీజీ ఒక మార్గదర్శక శక్తిగా ఉన్నారని ఆయనతో కలిసి పని చేసే భాగ్యం పొందిన ప్రతి ఒక్కరూ ఎంతో స్ఫూర్తిని పొందారని అభిప్రాయపడింది. 

ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ ఐఆర్ ఈసీఎల్ ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ ఐసీఎల్ )ను 2011లో సెబీ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించి ఈ రెండు కంపెనీలు నిధులు సమీకరించాయని రెగ్యులేటర్ పేర్కొంది.
 
ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలన్న సెబీ ఆదేశాలను 2012 ఆగస్టు 31న సుప్రీంకోర్టు సమర్థించింది. చివరకు ఇన్వెస్టర్లకు రిఫండ్స్ కోసం సెబీ వద్ద రూ.24,000 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను కోరింది. అయితే ఇది డబుల్ పేమెంట్ అని, ఇప్పటికే 95 శాతానికి పైగా ఇన్వెస్టర్లకు ఈ మొత్తాన్ని నేరుగా రీఫండ్ చేశామని తెలిపింది.

అఖిలేష్ యాదవ్ సంతాపం
సహారా శ్రీ సుబ్రతా రాయ్ మరణం ఉత్తర ప్రదేశ్‌కు, దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన చాలా విజయవంతమైన వ్యాపారవేత్త అని, చాలా సున్నితమైన పెద్ద హృదయం కలిగిన వ్యక్తి అని, లెక్కలేనన్ని మందికి సహాయం చేసి వారికి మద్దతుగా నిలిచారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆయన మనసుకు శాంతి చేకూరాలని కోరారు. 

ఎవరీ సుబ్రతా రాయ్?
సుబ్రతా రాయ్ 1948 జూన్ 10న బీహార్‌లోని అరారియాలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం కోల్ కతాలోని హోలీ చైల్డ్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత యూపీలోని గోరఖ్ పూర్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రాయ్ 1978లో సహారా ఇండియా పరివార్ ను స్థాపించారు.

సుబ్రతా రాయ్ ఏ వ్యాధి కారణంగా మరణించాడు?

‘మెటాస్టాటిక్ సమస్య, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో సుదీర్ఘ పోరాటం తర్వాత కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా 2023 నవంబర్ 14న రాత్రి 10.30 గంటలకు సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో 2023 నవంబర్ 12న కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు.

అంత్యక్రియలు ఎప్పుడు?

సహారా చీఫ్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు గురువారం (నవంబర్ 16, 2023) లక్నోలో జరగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బుధవారం (నవంబర్ 15) లక్నోకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *