National
oi-Srinivas Mittapalli
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
డీఎంకె అధినేత ఎంకె స్టాలిన్ కూడా సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘డీఎంకె పార్టీ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి,దక్షిణాది దిగ్గజ నేత కె.చంద్రశేఖర్ రావుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలంగాణ కోసం,దేశం కోసం ఆయన మరిన్ని సంవత్సరాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎంకు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్నో ఆటంకాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన యోధుడు.. స్పూర్తిని రగిలించే ఉద్యమకారుడు… పరిపాలనాదక్షుడైన వ్యక్తి నాకు తండ్రి అయినందుకు గొప్పగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ గారు..’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ,కేసీఆర్ తనయ కవిత… ‘నా జన్మదాతకు,నిత్య స్పూర్తి ప్రధాతకు జన్మదిన శుభాకాంక్షలు..’ అని ట్వీట్ చేశారు.
On behalf of DMK, I convey my heartiest birthday wishes to Telangana Chief Minister and veteran political leader from the South Hon’ble K.Chandrasekhar Rao.
Wish him many more years of active public service for his state of Telangana and the country.@TelanganaCMO
— M.K.Stalin (@mkstalin) February 17, 2021
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ మూడేసి మొక్కలను నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయం 10గంటల నుంచి 11గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రతి పంచాయతీకి వెయ్యి మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు. ఇందుకోసం అన్ని గ్రామాలు,పట్టణాలకు మొక్కలను సరఫరా చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం, సబ్బండ వర్గాలు ఇందులో పాల్గొని కేసీఆర్ పుట్టినరోజున హరిత కానుక ఇవ్వనున్నారు.
Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) February 17, 2021